Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి కాలంలో అన్ని పనులు ల్యాప్టాప్లు, మొబైల్లపై ఆధారపడి చేస్తున్నారు. దాంతో ఎవ్వరూ శారీరక శ్రమ సరిగ్గా చేయడం లేదు. దీంతో చాలామంది కొద్దిపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. కొద్దిగా చెమట వచ్చినా సహించలేకపోతున్నారు. కానీ శరీరం నుంచి చెమట రావడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెమట వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
ఆరోగ్యానికి చెమట ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు పేర్కొంటారు. మనిషి చాలినంత చెమటను బయటకు స్రవించడం ద్వారా మొఖం మీద మొటిమలు రాకుండా చెమట గ్రంథులు నిరోధిస్తాయని అంటున్నారు.
వ్యాయామం సమయంలో చెమట: మీరు వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అటువంటి పరిస్థితిలో చెమట మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. మూర్ఛను నివారిస్తుంది.
విష పదార్థాలను బయటకు తీస్తుంది: చెమట మీ శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. కొన్ని పరిశోధనలు చెమటలో ఉప్పు, చక్కెర కాకుండా, కొలెస్ట్రాల్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో శరీరం బాగా శుభ్రం అవుతుంది అన్ని అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి.
చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది: చెమట బయటకు వచ్చినప్పుడు, చర్మంపై షైన్ వస్తుందని నిపుణులు చెబుతారు. అసలైన చెమట కారణంగా చర్మం రంధ్రాలు తెరవబడతాయి. అటువంటి పరిస్థితిలో చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా చెమట ద్వారా బయటకు వస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి కూడా.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: రోజూ పని చేసేటప్పుడు చెమట పడితే అది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ కారణంగా మీ శరీరం అన్ని వ్యాధులపై పోరాడే శక్తిని అభివద్ధి చేస్తుంది. మీరు తక్కువ అనారోగ్యానికి గురవుతారు.