Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీల్‌చైర్ నుండి స్వర్ణం వరకు
కాస్త ప్రోత్సాహం అందిస్తే మహిళల విజయానికి ఏదీ అడ్డంకి కాదు... అది మరో సారి రుజువయింది. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా షూటర్‌గా అవని లేఖారా చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన ఈమెను చూసి ఇప్పుడు దేశం గర్విస్తుంది.
జైపూర్‌కు చెందిన అవనీ లేఖరా 2001 నవంబర్ 8న జన్మించింది. 19 ఏండ్ల వయసులోనే చరిత్ర సృష్టించింది. 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నుముక విరిగిపోయింది. అప్పటి నుండి పూర్తిగా వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఎటూ కదలలేని స్థితిలో, ఓ చీకటి గదిలో ఉంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అలాంటి సమయంలోనే తన బిడ్డకు జీవితంపై ఆసక్తి పుట్టించాలని తండ్రి ఆమె దృష్టిని క్రీడలవైపుకు మళ్ళించాడు.
కాలక్షేపానికి మొదలుపెట్టి
అప్పటి వరకు అవనీకి ఆటలు అంటే పెద్దగా ఆసక్తి లేదు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో షూటింగ్‌తో పాటు విలువిద్యను కూడా నేర్చుకునేది. తర్వాత కాలంలో షూటింగ్‌పై మక్కువ పెంచుకుంది. ప్రారంభంలో షూటింగ్‌కి కేవలం కాలక్షేపానికి మాత్రమే టైం కేటాయించేది. అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్ అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీని 2008లో చదివిన తర్వాత ఆమె షూటింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది.
స్వర్ణం సాధించి
అలా ప్రారంభమైన ఆమె ప్రయాణం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించేదాకా దిగ్విజయంగా సాగింది. 2015లో జైపూర్‌లోని జగత్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో షూటింగ్ ప్రారంభించింది. న్యాయ విద్యార్ధి అయిన అవనీ 2017లో యుఎఇలోని అల్ ఐన్లో జరిగిన ప్రపంచకప్‌లో భారతదేశం తరపున అరంగేట్రం చేసింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో 249.6 పాయింట్లు సాధించి పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈతగాడు మురళీకాంత్ పెట్కార్ (1972), జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జహంరియా (2004, 2016), హై జంపర్ మరియప్పన్ తంగవేలు (2016) తర్వాత పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నాలుగో భారతీయ క్రీడాకారిణి అవనీ.
మొదటి అంతర్జాతీయ పతకం
అవనీ 2016 రియో గేమ్స్‌లో చైనాకు చెందిన క్యూపింగ్ జాంగ్‌ను వెనక్కు నెట్టి అసకా షూటింగ్ రేంజ్లో మొత్తం 248.9తో రజత పతకాన్ని సాధించింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ ఇరినా షెచ్నిక్ 227.5 ప్రయత్నంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అవనీకి ఇది మొదటి ప్రధాన అంతర్జాతీయ పతకం. 2019లో చివర్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. తన తొలి పారాలింపిక్స్‌లో కనిపించిన ప్రపంచ, ఐదవ స్థానంలో ఉన్న అవనీ రెండు పోటీ దశల్లోనూ స్థిరంగా 10 సెకన్లు షూట్ చేసింది. ఆమె ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ చివరికి రెండు 9.9 సెకన్లు ఆమెకు మార్క్ ఖర్చు చేసింది. అర్హత రౌండ్లో మొత్తం 621.7 తో ఏడవ స్థానంలో నిలిచింది.
అభినందనలు
''అద్భుత ప్రదర్శన అవనీ లేఖరా! కష్టపడి అర్హత సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు అభినందనలు. మీ శ్రమ, పట్టుదలతో పాటు షూటింగ్ పట్ల ఉన్న మక్కువ కారణంగానే ఇది సాధ్యమైంది. ఇది నిజంగా భారతీయ క్రీడలకు ఓ ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు'' అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.
ఇంకా సాధించాలి
నా ఆనందాన్ని నేను వర్ణించలేను. ఇప్పుడు నేనూ ఈ ప్రపంచం పైన ఉన్నట్టుగా భావిస్తున్నాను. ఇక ఏమీ చెప్పలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నేను సాధించబోయే విజయాలకు ఇది ప్రారంభంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఇంకా చాలా పతకాలు సాధించాలి.