Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షం పడుతున్నప్పుడు కాల్చిన వేడి వేడి మొక్కజొన్న తింటే ఆ మజానే వేరు కదా. అయితే కేవలం రుచి మాత్రమే కాదు. మొక్కజొన్నతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి 12, ఐరన్ కూడా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు పెద్ద సంఖ్యలో తయారవుతాయి రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.
వీటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా, శక్తి సులభంగా పెరుగుతుంది. అథ్లెట్లు, బాడీబిల్డర్లకు మొక్కజొన్న చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు పెరగాలనుకునే వారు మొక్కజొన్నను ఆహారంలో తీసుకోవడం మేలు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మొక్కజొన్నను ఆహారంగా తీసుకోవడం మంచిది.
మొక్కజొన్నలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి మొక్కజొన్న చర్మాన్ని రక్షిస్తుంది.