Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడినా తమ చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటివారు కొన్నిచిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతగా మారుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్‌తో తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి. జంగ్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. నూనె, కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ప్రాణాయామం చేయండి. మీ ముఖాన్ని దుమ్ము, సూర్యకాంతి నుంచి రక్షించండి. ముఖాన్ని సబ్బులేకుండా కేవలం మంచినీటితో రోజుకు మూడునాలుగు సార్లు కడగాలి.
రోజ్‌వాటర్‌తో: రోజ్ వాటర్ సహజంగా ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మంలోని నూనెను తగ్గించి చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం రోజ్ వాటర్‌లో యాంటీమై క్రోబయాల్స్, యాంటి ీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జిడ్డు చర్మానికి ఇది బాగా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌లో కాటన్ బాల్ లేదా కాటన్ ఉన్ని చిన్న ముక్కను నానబెట్టి ముఖాన్ని శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం వికసిస్తుంది చర్మంలో ఉండే జిడ్డుని పూర్తిగా తొలగిస్తుంది.
ముల్తానీ మిట్టితో: ముల్తానీ మట్టిలో ఉండే పుష్కలమైన ఖనిజాలు జిడ్డు చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి. ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ చర్మం నుండి నూనెను గ్రహిస్తుంది. అదనంగా సహజ సౌందర్యాన్ని ఇస్తుంది. ఇది మొటిమలను వాటి తాలూకు మచ్చలను తొలగిస్తుంది.
వేపతో: చర్మ సౌందర్యాన్ని పెంచడానికి వేపను కూడా ఉపయోగిస్తారు. జిడ్డు చర్మం వాళ్లు ఈ వేప ప్యాక్ కూడా చాలా బాగా పని చేస్తుంది.
నారింజతో: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండుగా నారింజ మనందరికీ తెలుసు. అయితే నారింజ చర్మానికి యాంటీఆక్సిడెంట్లను ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. నారింజ తొక్కతో చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడమే కాకుండా ముఖంపై ఉండే మచ్చలు తగ్గించడానికి కూడా పని చేస్తాయి.
బొబ్బాయి రసంతో: బొబ్బాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా జిడ్డు చర్మంగల వారికి ఫేస్‌ప్యాక్‌లా కూడా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్-కె, సి, పొటాషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషక లక్షణాలు ఉన్నాయి. అదనంగా ఇది సిలికాన్ అనే ప్రత్యేక మూలకాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది చర్మకాంతిని పెంచడానికి సహాయపడుతుంది. బొబ్బాయి రసం చర్మానికి ఉత్తమమైన టానిక్‌గా పనిచేస్తుంది. ముఖం మీద తాజాదనాన్ని కలిగిస్తుంది.