Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రెగెంట్ అవ్వడం... బిడ్డకు జన్మనివ్వడం జీవితంలో ఎంతో గొప్ప విషయం. దీనికి మించిన ఆనందం మరొకటి ఏమీ ఉండదు. తల్లి కాబోతున్నాను అని తెలిసిన తర్వాత ఆ మహిళల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఆనందంతో పాటు మొదటిసారి ప్రెగెంట్ అయిన తర్వాత కొంత టెన్షన్ కూడా మొదలువుంది. వెంటనే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం...
చాలామంది ఈ విషయాన్ని ఆనందంగా తమ ఆత్మీయులు ఎవరికైనా పంచుకోవాలని అనుకుంటారు. అయితే ఎవరికైనా వెంటనే చెప్పడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామికి కానీ మీ బెస్ట్ ఫ్రెండ్‌కి కానీ లేదా మీ ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఈ విషయాన్ని చెప్పుకోండి. ఇది నిజంగా మీ ఆనందాన్ని మరింత ఎక్కువ చేస్తుంది.
డాక్టర్ అపాయింట్మెంట్
ప్రెగెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి. డాక్టర్లు కూడా మీ ఆరోగ్యాన్ని చూసి ముఖ్యమైన విషయాలు చెబుతారు. అదే విధంగా మీరు డైట్లో ఏం తీసుకోవాలి.. అవసరాన్ని బట్టి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు.
ప్రినేటల్ విటమిన్స్
ఇటువంటి సమయంలో మీకు కావల్సిన సప్లిమెంట్స్, విటమిన్స్‌ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రినేటల్ విటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల బేబీ ఆరోగ్యం బాగుంటుంది.
కెఫిన్కి దూరంగా
ప్రెగెన్సీ వచ్చిన తర్వాత వీలైనంత వరకు కెఫిన్కి దూరంగా ఉండటం మంచిది. రోజుకి కెఫీన్ 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవడం అస్సలు మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. 200 మిల్లీ గ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మిస్ క్యారేజ్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
పోషక ఆహారం
ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది
కాస్త జాగ్రత్త
సాధారణంగా చాలా మంది మహిళల్లో క్రామ్ప్స్, తలనొప్పి, మార్నింగ్ సిక్నెస్ వంటివి ఉంటాయి. ఇటువంటి వాటితో జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉండాలి. కనుక వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగడం, రెస్ట్ తీసుకోవడం లాంటివి చేయాలి.
ప్రత్యేక శ్రద్ధ
కొంత మందికి బ్లీడింగ్, కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. అటువంటి వాళ్ళు కచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇలా తొమ్మిది నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలి. ఎంత మంచి పోషకాహారం తీసుకుంటే బిడ్డ అంత బాగుంటుంది అని తెలుసుకోండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.
అశ్రద్ధ వద్దు
కొంత మంది గర్భిణీలు వాళ్లకి తెలియక సమస్యలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోక పోవడం అదే విధంగా సరైన వైద్యం తీసుకోకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఆలస్యం చేయడం పెద్ద పొరపాటు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని మంచి వైద్యుల సలహా తీసుకుని అనుసరించడం మేలు. సమస్య చిన్నదే కదా తర్వాత చూద్దాం అని వాయిదా వేయద్దు. సరైన వ్యాయామం, ఆహారం తీసుకుంటే ఏ సమస్య లేకుండా హాయిగా ఉండచ్చు.