Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊబకాయం.. అన్ని అనారోగ్యాలకు ప్రధాన కారణం. ఇది ఓ అసాధారణ సమస్య. కరోనాతో ఇప్పటికే అందరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం పెద్దవారిలోనే కాదు 18-24 ఏండ్ల వారిపై కూడా ప్రభావం పడుతుందని ఇటీవలి కొన్ని నివేధికలు తెలిపాయి. అది రాబోయే మరో 10 ఏండ్లలో ఇతర వయసు వారితో పోలిస్తే.. ఈ వయసువారు ఊబకాయంతో బాధపడతారని చెబుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, చారిటీ యూనివర్సిటీస్ మెడిజిన్ బెర్లిన్ పరిశోధకులు ఈ అధ్యయనంపై చేసిన పరిశోధనలను 'ది లాన్సెట్ డయాబెటీస్, ఎండోక్రనాలజీ' ప్రచురించింది. యువతలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుందని, సామాజిక, ఆర్థిక, లింగ ఇతర సమస్యలు దీనికి ప్రధాన కారణమని అధ్యయనలో కనుగొన్నారు. బరువు పెరిగి వయసుతోపాటు క్రమంగా తగ్గుతూ వస్తుందన్నారు.
పరిశోధకులు దాదాపు 2 మిలియన్ల యువత ప్రైమరీ కేర్ హెల్త్ రికార్డులపై ఈ పరిశోధన చేసి ముఖ్యంగా 1998-2016 సంవత్సరంలో పుట్టిన ఏజ్ గ్రూపుల్లో ఎక్కువ శాతం ఒబేసిటీ బారిన పడే రిస్క్ ఎక్కువ ఉందని చెప్పారు.
రాబోవు పదేండ్లలో ముఖ్యంగా 18-24 వయసువారు.. 65-74 వయసు వారితో పోలిస్తే ప్రస్తుతం కంటే దాదాపు నాలుగు రెట్లు బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు, ఒబేసిటీ అని వర్గీకరించిన యువతను అధిక బీఎంఐ కేటగిరీకి మారే అవకాశం పుష్కలంగా ఉందట.
అధిక బరువు కేటగిరీ వ్యక్తిగతంగా చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొవిడ్-19 మహమ్మారి కారణంగా స్థూలకాయానికి చేరువవుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
బీఎంఐ మార్పునకు వయసు చాలా ముఖ్యం. సోషియోడెమొగ్రాఫిక్ కారకాల్లో ఇది ఒకటి అని అధ్యయనంలో స్పష్టంగా ఫలితాలు చూపిస్తున్నాయి. వృద్ధులతో పోలిస్తే 18-24 ఏండ్ల వయసు యువతలో బీఎంఐ పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఒబేసిటీ ఉన్న వ్యక్తుల్లో పెద్దలతో పోలిస్తే 35-54 వయసువారు బరువు తగ్గకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉందట. అధిక బరువుకు కేటగిరీకి మారే వ్యక్తిగత బరువును తెలుసుకోవడం ముఖ్యం.
బీఎంఐ మార్పునకు వయసు అత్యంత ముఖ్యం. దీంతోనే గణంగాలు కూడా చేపడతారు. అందుకే 18-24 ఏండ్ల యువత పెద్దవారితో పోలిస్తే బీఎంఐ పొందే ఛాన్స్ ఎక్కువని ఫలితాలు స్పష్టంగా చూపుతున్నాయి.
యువత జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. అంటే వారు ఇంటికి దూరంగా ఉంటూ, కాలేజీ లేదా ఆఫీస్ పనులకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వారికుండే అలవాట్లు ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం.