Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనీసం ఆరు నెలలు తల్లి పాలు ఇవ్వాలి. ఆ తర్వాత తల్లి పాలు ఇవ్వటం ఏ కారణం వల్లనైనా వీలు కాకపోతే వేరే పాలు కూడా వాడొచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. ఐదారు నెలల తర్వాత మనం తినేవన్నీ పిల్లలకు పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి వంటలు ఏమీ చెయ్యనక్కర లేదు. పిల్లలు, పెద్దవాళ్ళు కలసి తినాలి. పిల్లలు తమ చేతులతో తాము తింటారు. దానిని మనం ప్రోత్సహించాలి.
పిల్లలకి వారి ఆకలిని బట్టి పెద్దవారికన్నా ఎక్కువ సార్లు తినవలసిన అవసరం ఉండవచ్చు. పిల్లలను ఊరుకోబెట్టటానికి తిండిని సాధనంగా వాడకూడదు. పిల్లలకు తిండి పెట్టుకోవటం అప్రయత్నంగా, ఆహ్లాదంగా ఉండాలి. కష్టంగా అనిపించకూడదు. కష్టంగా ఉందంటే మీరు సరైన మార్గంలో లేరని అర్ధం.
రోజు మొత్తంలో ఓ గుడ్డు, ఓ గ్లాసు పాలు, ఏదో ఒక ఫ్రూట్ కనీసం ఒక అరటి పండు కచ్చితంగా ఉండాలి
రోజుకీ కనీసం రెండు స్పూన్ల నెయ్యి ఇవ్వండి.
పెరుగు తినడం నేర్పించండి. అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి అంటే మంచి బ్యాక్టిరిీయా చాలా మేలు చేస్తాయి
పల్లీలు, నువ్వులు, కొబ్బరి, మినుములు వీటిని బెల్లంతో కలిపి ఉండలుగా చేసి పెట్టండి. దీని వల్ల ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం బాగా అందుతాయి
మైదా, పంచదార, కూల్డ్రింగ్స్కి దూరంగా ఉంచండి. వీటివల్ల ఫిట్‌కు బదులు ఫ్యాట్‌గా అవుతారు పిల్లలు
మట్టిలో పిల్లల్ని ఆడుకొనివండి, వ్యాయామం చేయడం అలవాటు చేయండి,సెల్ ఫోన్‌కు పిల్లలు దూరం ఉండడానికి ట్రై చేయండి