Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి వేళల్లో నిద్రపట్టక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటివారు ఈ కింది చిట్కాలు పాటించాలి.
నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ ఘనపదార్థాలను కానీ తీసుకోకూడదు. అందువల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ, కాఫీలను ఎక్కువగా తాగరాదు. టీ కాఫీలకు బదులుగా బాదం పాలు మొదలగునవి తీసుకోవచ్చు.
గోరువెచ్చని పాలు గ్లాసుడు నిద్రించే ముందు రాత్రిపూట తాగితే మంచిది.
పగటిసమయంలో ఎక్కువగా నిద్రపోరాదు. దాంతో రాత్రి నిద్రరాదు.
ఒంటరిగా పడుకోవడం వల్ల నిదురరాకపోతే ఆత్మీయుల చెంత నిద్రించండి.
నిద్రరానని మొరాయిస్తే మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు.
నిద్రమాత్రలకు దూరంగా వుండండి. వాటిని నిద్రకోసం వాడకూడదు. అలా వాడితే నిద్రమాత్రలు ఒంటికి అనారోగ్యం.
నిదురించే ముందు ఎలాంటి ఆలోచనలు చేయరాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి. అలాచేస్తే చదువుతూనే నిద్రపోతారు.
పదేపదే పడకస్థానాన్ని మార్చవద్దు. కొత్తప్రదేశం నిద్రకు ఇబ్బంది కలుగజేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.