Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఉద్యోగినులు వృత్తిలో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటారు. అందుకు తగినట్టు ఎక్కువ గంటలు పని చేస్తారు. అయినా అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోతారు. చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ వైఫల్యాలు. మరి అలా కాకుండా ఉండాలంటే...
చాలామంది ఆదరాబాదరాగా పని మొదలుపెడుతుంటారు. ఆఫీసుకు వచ్చాక రెండు నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చొండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఆ తర్వాత పని మొదలుపెట్టండి.
జరిగిపోయిన దాని గురించి బాధ, ఆందోళనలు పడకుండా ఈ రోజు ఏం చేయాలో అనేది మాత్రమే ఆలోచించండి. నిన్న జరిగిన ప్రతికూల అంశాలన్నింటినీ బుర్ర నుంచి ఖాళీ చేయండి. ఈ రోజు చేసే పనులపై వందశాతం దృష్టి పెట్టండి.
ఆ రోజు ఏమేం పనులు చేయాలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో... ఓ చోట రాసుకోవాలి. ఇందుకోసం దాదాపు అరగంట కేటాయించుకోవాలి. అన్ని పనులను ప్రాధాన్య క్రమంలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఒక్కోటి పూర్తి చేసుకుంటూ పోతే సరి. సామాజిక మాధ్యమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిల్స్‌కు కూడా పరిమిత సమయాన్ని పెట్టుకుంటే సరి.
మీకు ఎన్ని ఇబ్బందులున్నా పరిస్థితులు బాగాలేకపోయినా కిందటి రోజు రాత్రి సరిగా నిద్రపోయకపోయినా.. ఇలా ఎన్ని సమస్యలున్నా ఆఫీసులో మాత్రం చాలా అలెర్ట్‌గా ఉండాలి.