Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌందర్య పోషణలో రకరకాల చిట్కాలు పాటిస్తాం. అయితే వీటితోపాటు రోజువారీ చేసే పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటాం. అలా కాకుండా అందాన్ని మెరుగు పరుచుకోవడానికి కొన్నింటిని పాటిస్తే అది రెట్టింపవుతుంది. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం.
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఫేస్వాష్నే వాడాలి. అలాగే శుభ్రం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
కురుల కోసం ప్రత్యేకమైన పోషణ, సంరక్షణ తీసుకోవాలి. కొబ్బరినూనెతో మర్దనా చేసుకోవడం, గాఢత తక్కువగా ఉండే షాంపూ మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పెదాలకు రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా లిప్‌బామ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి.
చర్మంతోపాటు, గోళ్ళ సంరక్షణకు సమయం కేటాయించాలి.
మొటిమలను గిల్లకూడదు. సాన్నానికి గోరువెచ్చటి, చల్లటి నీళ్లనే ఉపయోగించాలి.
రోజులో తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేట్‌కు కాకుండా తాజాగా ఉంటుంది.
రోజూ అరగంట చొప్పున వారంలో కనీసం అయిదుసార్లు వ్యాయామం చేయాలి.
రోజులో అల్పాహారాన్ని మానకూడదు. ఎందుకంటే మిగతా రోజంతా మీరెలా ఉండాలో ఇదే నిర్ణయిస్తుంది. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కాయగూరలను తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు సాధ్యమైనంతగా దూరంగా ఉండాలి.
దాదాపు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. అప్పుడే చర్మం ముడతలు, గీతలు పడకుండా ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.