Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని అలవాట్లు మనకు చిన్నవిగానే అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి అందులో కొన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
తుమ్ములు ఆపుకోవడం... ఒక్కోసారి ఏదైనా ముఖ్యమైన మీటింగ్లు ఉన్నపుడు తుమ్ములు ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా చిన్న విషయమే కానీ దీని వల్ల చాలా ప్రమాదం ఉంది. తుమ్మే సమయంలో గంటకు160 కీమీ వేగంతో గాలి బయటకు వస్తుంది. ముక్కు, నోరు మూసి తుమ్మును ఆపేస్తే.. అది చేవిలోకి చేరి కర్ణభేరిని పాడుచేస్తాయి. దాంతో వినికిడి శక్తి లోపిస్తుంది. ఇది ఒక్కటే కాదు తుమ్ము ఆపడం వల్ల కండ్లు, మెదడు, ముక్కులోని నరాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉందట. కాబట్టి తుమ్ము వచ్చినపుడు ఆపకండి.
చీకట్లో మొబైల్స్ వాడటం... ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల మొబైల్స్ ద్వారా వచ్చే ఒకరకమైన బ్లూలైట్ కంటి రెటీనాపై తీవ్ర ప్రభావం చూపుతేంది. దీనివల్ల కంటిచూపు మంద గించడం, తాత్కాలిక అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు నిద్రకు ముందు ఫోన్ చూడటం వల్ల ఇన్సోమియా అనే నిద్ర సంబంధిత వ్యాధి రావచ్చు. ఆ సమయంలో సెల్ చూడడం తప్పనిసరి అయితే గదిలో లైట్లు ఆన్ చేసి మొబైల్ వాడాలి. లేకపోతే బ్రైట్నెస్ను తగ్గించే యాప్లను డౌన్లోడ్ చేసకుంటే సరిపోతుంది.
పంచదార ఎక్కువగా తినడం... తీపి అందరికీ ఇష్టం. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్ది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది శరీరంలోని అవయవాలపై తీవ్రంగా ఉంటుంది. విపరీతమైన ఆకలి, డయాబెటీస్, బరువు పెరగడం, హైబీపీ, ప్యాన్క్రియటిక్ కేన్సర్, లివర్ ఫెయిల్యూర్, గుండెపోటు, కీళ్లవాతం ఇలా ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. ఒక స్టడీ ప్రకారం సిగరేట్, మందు ఎంత హానికరమో.. పంచదార కూడా అంతే ప్రమాదం అని తేలింది.
టైట్ జీన్స్ వేసుకోవడం... ఇది కూడా ప్రమాదం. దీనివల్ల ఎక్కువసార్లు టాయిలేట్ రావడం, కాళ్లలోకి రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం, మహిళల్లో గర్భశయ సమస్యలు కూడా వస్తాయి.
యూరిన్ ఆపుకోవడం... ఇలా ఎక్కువసేపు ఆపుకుంటే యూరిన్లో బ్యాక్టిరియా కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బ్యాక్టిరియా రక్తంలో కలుస్తుంది. బ్లాడర్ కండరాలు కూడా వీక్ అవుతాయి. ఇలా చేస్తే యూరిన్తోపాటు బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లడర్ పగిలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం... ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు. చాలా మంది టైం సరిపోక లేదా డైట్ చేస్తూ ఉదయం బ్రేక్ఫాస్ట్ తినరు. వీరిలో 84 శాతం గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావంలో ఇబ్బందులు వస్తాయి. మైగ్రేయిన్, జుట్టు ఊడిపోవడం, షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి.