Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్ట గొడుగులను రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
మహిళలకు అత్యవసరమైన హార్మోన్లను సమన్వయం చేయడంలో పుట్టగొడుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిలో సాయపడతాయి. హృద్రోగం వంటి అనారోగ్యాలు రాకుండా పరిరక్షిస్తాయి. క్రమం తప్పే నెలసరిని సరిచేస్తాయి. అధిక రక్తస్రావం, పెల్విక్ భాగంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. ఆ సమయంలో వచ్చే ఆందోళన, ఒత్తిడి వంటివాటిని దరి చేరనివ్వవు.
హార్మోన్ల లోపం వల్ల వచ్చే అవాంఛిత రోమాలు, చర్మంపై వచ్చే నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను నిరోధిస్తాయి. అంతేకాదు, ఎండోమెట్రియాసిస్ సమస్యతో గర్భాశయంలో వచ్చే పలురకాల అనారోగ్యాలనూ తగ్గిస్తాయి.