Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధగుణాలు ఉన్న మొక్క కలబంద. దీని జిగురులా ఉండే గుజ్జును చర్మ, కేశ సౌందర్య చిట్కాలలో, క్రీములు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తుంటారు. కానీ కొంచెం తేనేతో కలిపి శరీరం లోపలికి తీసుకోవడం వల్ల చాలా లాభాలుంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడయింది. అవేంటో చూద్దాం.
కలబందలో సాలిసిలిక్ ఆసిడ్, నిసమోనిక్ ఆసిడ్లు, ఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా ఉపయోగపడి అనేక వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆలోవెరాలో గిబ్రిలిన్ అనే కెమికల్ ఉండి దెబ్బలు, గాయాలపై పసుపు కలిపి రాస్తే కొలాజిన్, ఫైబరో బ్లాస్ట్లను పెంచి గాయాలను మాన్పుతుంది.
నీ గ్లూకోసిన్ అనే కెమికల్ శరీరంలో తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన మలినాలను తొలగించడంలో యాంటీ ఇనఫ్లమేటర్లా పని చేస్తుంది.
ఆల్ప్రోజిన్ మన శరీరంలో రక్షణ వ్యవస్థను సరిగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. హైపర్ ఏక్టివా ఉన్న కణాలను, పని చేయకుండా ఉన్న కణాలను సరిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
యాంత్రోక్వినోన్స్ అనే కెమికల్ ఇది. అలోవెరా తింటే జెల్లా ఉండే గుజ్జు పేగులలో కదలిక కలిగించి శుద్దిచేసి మలబద్ధకం తగ్గిస్తుంది. అనేక ఉదర సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.
బ్రడీకైనేజ్ అనే ఎంజైమ్ వలన శరీరంలో క్రానిక్ ఇనఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా కాన్సర్ కణాలను నిరోధిస్తుంది. కలబంద గుజ్జుని తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక దంత సమస్యలు రాకుండా చేస్తుంది.
తాజా కలబంద తినడం వల్ల ఎముకలలో గుజ్జు తగ్గకుండా చేసి ఎముక, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. మధుమేహం, బరువు తగ్గడంలో కలబంద చాలా మంచి ఫలితాలు చూపినట్టు అనేక పరిశోధనలు తెలిపాయి.
అలాగే హెర్పెస్, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యల చికిత్సలో చాలా బాగా పని చేస్తుంది. కలబంద మంటలు దురదలు తగ్గిస్తుంది. కలబంద తరచూ వాడడం వల్ల ముఖపై ముడతలు తగ్గించి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది.
జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తూ కనిపిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ గుణాల వలన చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు తగ్గిస్తుంది.