Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ఉమెన్స్ హెల్త్ రిపోర్ట్ 2021 అధ్యయనాన్ని భారతదేశ వ్యాప్తంగా ఏడు నగరాలలో 25-55 సంవత్సరాల నడుమ వయసు కలిగి వివిధ సంస్థలలో ఉద్యోగులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 1000 మంది మహిళలపై నిర్వహించారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, దాదాపు సగం మందికి పైగా మహిళలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మహిళల ఆరోగ్య సమస్యలను గురించి మాట్లాడటాన్ని సౌకర్యంగా భావించలేదు. దీనికి సామాజిక అపోహలు, ఆ సమస్యలతో కలిసి ఉన్న భయాలే కారణమని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఇప్సోస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇప్సోస్ ఇండియా)తో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించింది. సామాజిక, సాంస్కృతిక, వైద్య పరమైన అంశాల పరంగా వర్కింగ్ ఉమెన్ ఆలోచనలు తెలుసుకోవడంతో పాటుగా వారి సమస్యలకు తగిన పరిష్కారాలను సైతం కనుగొనాలనే లక్ష్యంతో ఈ అధ్యయనం చేశారు.
అధ్యయనంలో కనుగొన్న కీలకాంశాలు
కుటుంబ/వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతలను సమతూకం చేసుకోవడంలో 81శాతం మంది మహిళలు సంఘర్షణను ఎదుర్కొంటున్నారు.
కేవలం 43శాతం మంది మహిళలు మాత్రమే ఆరోగ్యం, పని నిర్వహించుకోవడం కష్టంగా భావిస్తున్నారు
77శాతం మంది మహిళలు ఉద్యోగాలను మానేయడం/తమ కెరీర్లకు విశ్రాంతి నివ్వడం గమనించామని వెల్లడించారు. ఆరోగ్య పరంగా అత్యంత సహజమైన కారణాలుగా పీసీఓఎస్, గర్భవతి కావడం, ఎండోమెట్రియోసిస్ (53శాతం) చెబుతున్నారు.
71శాతం మంది మహిళలు తమ పురుష సహోద్యోగులు మహిళల ఆరోగ్య సమస్యల పట్ల సున్నితత్త్వంతో ఉండటం లేదని వెల్లడిస్తున్నారు.
ఎక్కువగా వినిపించే మూస కామెంట్ 'ఆమెకు వివాహమైంది, త్వరలోనే ఆమె కెరీర్ ముగుస్తుంది' (53శాతం)
83శాతం మంది మహిళలు నెలసరి పరంగా మూసపద్ధతులు/తీర్పులను చూస్తున్నా మంటున్నారు
అతి సహజంగా వినిపించే కామెంట్ 'దేవాలయం దగ్గరకు వెళ్లవద్దు, కిచెన్, ఇతర స్వచ్ఛతతో కూడిన ప్రాంగణాల వద్దకు వెళ్లవద్దు' (57శాతం)
తమ సహోద్యోగులు/బంధువులు/స్నేహితులు ఉద్యోగాలను మానేయడం చూశామని 86శాతం మంది వెల్లడిస్తున్నారు. వీరిలో 59శాతం మంది ఆరోగ్య సమస్యలే ప్రధానకారణమని చెబుతున్నారు.
84శాతం మంది వర్కింగ్ ఉమెన్, బహిష్టు కాలంలో ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్లవద్దని లేదా వంటగదిలోకి రావొద్దని లేదా తమ శానిటరీ న్యాప్కిన్లను దాయమని చెప్పడం వంటివి చూశామని వెల్లడించారు.
ఎండోమెట్రియోసిస్తో బాధపడే మహిళలు వివాహానికి అనర్హులని సమాజం భావిస్తుందని 66శాతం మంది ఉద్యోగిణిలు భావిస్తున్నారు
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం పీసీఓఎస్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ వంటి అంశాలను గురించి మాట్లాడటం ఇప్పటికీ నిషిద్ధ మరియు మూసపద్ధతుల్లోనే ఉంది. భారతదేశంలో మహిళల ఆరోగ్యం పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ఇది వెల్లడిస్తుంది.