Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు కప్పుల శుభ్రమైన నీటిలో రెండు చెంచాల నాన్ అయోడైజ్డ్ సాల్ట్‌ను కలిపి ముఖాన్ని కడిగితే చాలు. చర్మంలోని బ్యాక్టీరియాలను పీల్చడమే కాదు, మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.
మచ్చల్లేకుండా... చర్మాన్ని బిగుతుగా చేసి చర్మరంధ్రాల్లో కలిగే పలు రకాల సమస్యలను ఉప్పు నీళ్లు దూరం చేస్తాయి. ఈ రంధ్రాల్లో చేరే నూనెను పీల్చుకుని జిడ్డు లేకుండా చేస్తాయి. అలాగే చర్మంపై మొటిమలు రావడానికి కారణమయ్యే మతకణాలను పోగొడతాయి. దీంతో మచ్చల్లేకుండా ముఖచర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
సమస్యల నుంచి... ముఖం ఎక్కువగా పొడారిపోవడం లేదా సొరియాసిస్ వంటి సమస్యలుంటే ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. చర్మం మదువుగా మారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కనీసం రోజుకొకసారి ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత, కాస్త సీ సాల్ట్ కలిపిన నీటితో కడిగితే, ఇందులోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు, చర్మంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.
టోనర్‌గా... ఉప్పునీరు ముఖానికి ఫేషియల్ టోనర్‌గా ఉపయోగ పడుతుంది. మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని ఉప్పునీటిలో ముంచిన మెత్తని వస్త్రంతో మదువుగా అద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీది జిడ్డు తొలగిపోయి, ఆ తర్వాత వేసే మేకప్ రోజంతా తాజాగా కనిపించేలా చేస్తుంది.
లేపనాల్లో... ముఖానికి వేసే లేపనాల్లో ఉప్పునీటిని కలిపితే చర్మ రంధ్రాల్లో ఉండే నూనెను తొలగిస్తుంది. అంతేకాదు, చర్మాన్ని హైడ్రేట్ చేసి, ఆరోగ్యంగా మారుస్తుంది. మాయిశ్చరైజర్‌గానూ ఉపయోగపడుతుంది.