Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్య సాధనను మధ్యలో వదిలేయకూడదు. ఎన్ని అడ్డంకులెన్నెదురైనా దాటి ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అధైర్యపడితే విజయాన్ని పొందడం కష్టతరమవుతుంది. దాంతో లక్ష్యం బలహీనపడుతుంది.
వాయిదా పద్ధతి అలవాటుంటే దాన్ని దూరంగా ఉంచాలి. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడానికి కషి చేయాలి. అప్పుడే.. తర్వాతి అడుగు వేయగలరు.
- లక్ష్యాన్ని చేరుకోవాలనే బలమైన నిర్ణయం మనసు నుంచి దూరమవకూడదు. అలాగే నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే చాలు. ఆసక్తి పెరుగుతుంది. అనుకున్నది సునాయసంగా సాధించొచ్చు.
ఎప్పటికప్పుడు దక్కించుకున్న చిన్నచిన్న విజయాలకు మనకు మనమే ప్రశంసించుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేలా చేస్తుంది. ముందుకు వెళ్లడానికి ప్రోత్సాహకరంగా మారుతుంది.
ఒక పుస్తకంలో నిర్దేశించుకున్న మార్గాన్ని రాసి ఉంచుకోవాలి. దాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఎదురైన విజయాలు, వైఫల్యాలు వంటివన్నీ అందులో పొందుపరుస్తూ ఉండాలి. వీటిని చదివిన ప్రతిసారీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సాధించడానికి ఇంకెంతో దూరం లేదనే భావన మనసులో కలుగుతుంది. ప