Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరాన్ని.. మనసును దఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. మీరెప్పుడ్కెనా 'స్కిప్పింగ్' ట్రై చేశారా? ఎందుకంటే దీనివల్ల శరీరంలోని బరువు తగ్గి మంచి శరీరాకతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే పొట్ట భాగంలో పేరుకు పోయిన కొవ్వును కూడా ఎలా కరిగించవచ్చంటున్నారు నిపుణులు. మరి స్కిప్పింగ్ చేయడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మీరు చేసే వ్యాయామంలో స్కిప్పింగ్ను కూడా భాగం చేసుకోండి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి క్రమంగా నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ప్రతిరోజూ ఓ గంటపాటు ఈ రకమైన వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు ఖర్చవుతాయి.
ఈ వ్యాయామం వల్ల భుజాలు తిప్పడం, పాదాలతో ఎగరడం వంటి వాటి వల్ల ఆయా భాగాలు దఢంగా, సులభంగా వంగేలా తయారవడంతో పాటు మిగతా శరీర భాగాల్లో కూడా కదలికలు ఏర్పడతాయి. ఫలితంగా శరీర భాగాలన్నీ సులభంగా వంగేలా తయారవుతాయి.
తాడాట వల్ల మనం జంపింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక మైలు పరిగెత్తిన దాంతో సమానమని నిపుణుల అభిప్రాయం.
దీనివల్ల శరీరంలో ఎముకలు దఢమవుతాయి. ఫలితంగా ఆస్టియోపొరోసిస్ సమస్యను అరికట్టే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంపై ఉండే ముడతలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కొంతమందిలో కాళ్లు నొప్పులు పుట్టడం, పాదాలు కమిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపకూడదు. ప్రతిరోజూ చేయడం వల్ల కొన్ని రోజులకు అలవాటు పడిపోయి కాలి కండరాలు, తొడలు దఢంగా తయారవుతాయి.
ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మానసికంగా కూడా దఢంగా తయారుకావచ్చు. మొదట్లో జంపింగ్ చేయడంలో తడబడినా చేస్తూ చేస్తూ ఉంటే మెదడు సరైన విధంగా స్పందించి తాడు కాళ్ల దగ్గరకు వచ్చినప్పుడు యాదచ్ఛికంగానే జంప్ చేసేస్తాం. కాబట్టి ఈ వ్యాయామం వల్ల మానసికంగా చాలా చురుగ్గా తయారుకావచ్చు.
ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాల కదలిక, జీవక్రియలు వేగవంతం అవడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది.
స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగవంతం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దాంతో ఉదరం లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ ఉంటుంది. ఫలితంగా అక్కడ ఉండే కొవ్వు కరుగుతుంది.
స్కిప్పింగ్ చేసిన వెంటనే దాహం వేస్తుందని నీరు తాగడం, ఏదైనా తినడం లాంటివి చేయకూడదు. అరగంట తర్వాత మొలకెత్తిన గింజలు, పండ్లు.. వంటి తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.