Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న జీవన శైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగా కరోనాతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెరగడంతో ఈ సమస్య మరింత అధికమైంది. వ్యాయామం లేక చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది డైటింగ్, వ్యాయామాలు, జిమ్‌ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు.
ఇతర సమస్యలు
అయితే డైటింగ్ చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బరువు తగ్గడం అటుంచితే.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటింగ్ సమయంలో కొవ్వు తక్కువగా ఉండే సమతుల్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు. అంతేకాదు మీ డైట్లో కొన్ని మార్పులు చేయాలని సలహాలిస్తున్నారు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే ఈ తప్పిదాలు చేయకూడదని చెబుతున్నారు.
ఈ పొరపాట్లు చేయకండి..
డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన ఆకలి నియంత్రిస్తాయి. మనలో చాలా మంది సలాడ్లకు బదులు రుచికరమైన వంటల వైపు మొగ్గుచూపుంటారు. అయితే వీటిలోని కొవ్వు పదార్థాలు బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. డైటింగ్ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోరు కాబట్టి శరీరం శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే 80 నుంచి 120 కేలరీలు గల ఆహారాన్ని తీసుకోండి. మీరు తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే కేలరీలను లెక్కించుకొని డైట్ ప్లాన్ చేసుకోండి.
అతి ప్రమాదం
వేగంగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది అధిక వ్యాయామాలు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక వ్యాయామాలతో థర్మోజెనిసిస్ పెరుగుతుంది. అందుకే ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో నడుస్తుండటం వంటివి చేయండి.
పరధ్యానాలకు దూరంగా
డైటింగ్ సమయంలో ఎక్కువ పండ్లు తినడం మంచిది. వీటిలోని పోషకాలు మనకు అదనపు శక్తినిస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే ఇతర ఆహారాల కంటే పండ్లు తినేందుకు మొగ్గుచూపండి. నెమ్మదిగా తినడం, ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఆహారం తినేటప్పుడు టీవీ చూడటం, ఫోన్ మాట్లాడటం వంటి పరధ్యానాలకు దూరంగా ఉండాలి. దీంతోపాటు మీ ఆహారంలో సరైన మొతాదులో ఫైబర్, ప్రోటీన్ ఉండేట్లు చూసుకోండి.