Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మనం పిల్లలకు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. అవేంటో చూద్దాం...
చాక్లెట్లు: పిల్లలు తినే చాక్లెట్లలో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో పాల మిశ్రమం కలిగిన చాక్లెట్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా డార్క్ చాక్లెట్లను అలవాటు చేయండి.
చిప్స్: నూనెలో వేయించిన చిప్స్‌లో మంచి ఆహార పోషకాలు ఏమీ ఉండవు. పైగా వాటిలో ఎక్కువ క్యాలరీలు, ఉప్పు, అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు ఉంటాయి. ఇకపై మీ పిల్లలు ఎప్పుడైనా చిప్స్ అడిగితే వాటికి బదులుగా ఉడకబెట్టిన మోరంగడ్డలు లేదా ఇంట్లో చేసిన పాప్ కార్న్, ఇతర స్నాక్స్ వారి చేతిలో పెట్టండి.
క్యాండీలు, ఫ్రూట్ గమ్స్: క్యాండీలు, ఫ్రూట్ గమ్స్‌లో అధిక శాతం చక్కెర, క్యాలరీలు ఉండటంతో పాటు పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా పండ్లు, నట్స్ వంటి పదార్థాల్ని తీసుకునేలా ప్రోత్సహించండి.
కెచప్: కెచప్ కూడా ప్రాసెస్ చేసిన పదార్థమే. పైగా వీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ పిల్లల ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటి స్థానంలో ఇంట్లోనే చేసిన టమాటో చట్నీ వంటివి ఆహారంలో అందించండి. ప