Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృదువైన, ఆరోగ్యవంతమైన చర్మం కోసం చాలామంది మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్‌ని వాడుతారు. వేలకు వేలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయినా కూడా ఫలితం ఉండడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. అయితే అందమైన చర్మం కోసం ఈ ఆరు సూత్రాలు పాటించండి..
చర్మం డ్రైగా ఉంటే తగినంత నీరు తాగినప్పుడు ఇది శరీరం నుంచి వచ్చే టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. సహజమైన గ్లో కూడా వస్తుంది.
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగడానికి దూరంగా ఉండాలి. అలాగే ఎండలో ఎక్కువగా తిరగకూడదు.
సమతుల్య ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఆరోగ్యకరమైన కణ ఉత్పత్తికి సాయం చేస్తాయి. యువీ ఎక్స్పోజర్ వంటి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
చర్మం నిత్యం యవ్వనంగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మనం నవ్వినప్పుడు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మానికి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. అప్పుడు ఆరోగ్యకరమైన మెరుస్తూ ఉండే చర్మం మీ సొంతమవుతుంది.
ఈ రోజుల్లో అందరూ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే నిద్రపోయే ముందు దానిని తొలగించుకోకపోతే చర్మాన్ని పాడు చేస్తుంది. నిద్రపోయే ముందు ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మ రంధ్రాలకు గాలి తగిలేలా చేస్తుంది. దీంతో గ్లో ఏర్పడుతుంది. ప