Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు, గృహిణులు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. డిప్రెషన్లోకి వెళుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో.. మన జీవితాల్లో ఒత్తిడి అనేది ఒక భాగమైపోయింది. అయితే తరచూ పని ఒత్తిడిని ఎదుర్కొనే మహిళల్లో గుండెపోటు ముప్పు అధికంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయని మొన్నటివరకు అధ్యయనాలు తెలిపాయి. కానీ గుండెజబ్బులకు దారితీసే కారకాల్లో పని ఒత్తిడి సైతం ఉందని మరోసారి రుజువుయింది. ఈ డిప్రెషన్‌ని తగ్గించుకోవడానికి పండ్లు తింటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా అరటి పండు.
ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి. దీనిని రెగ్యులర్‌గా తినడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. ఒత్తిడి, శారీరక బలహీనతతో బాధపడుతున్న మహిళలు కచ్చితంగా అరటి పండ్లను తినాలి. అరటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అరటి పండు వల్ల డిప్రెషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. అనేక పరిశోధనల ద్వారా అరటి పండు డిప్రెషన్ రోగులకు ఉపశమనం కలిగిస్తుందని స్పష్టమైంది. డిప్రెషన్‌ను తగ్గించడానికి ఉపయోగపడే ప్రోటీన్ అరటి పండులో ఉంటుంది. రిలాక్స్‌గా అనిపిస్తుంది. డిప్రెషన్ ఉన్న రోగి ఎప్పుడైనా అరటిపండు తింటే అతనికి ఉపశమనం లభిస్తుంది. అరటిలో ఉండే విటమిన్ బి6 శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సరిగ్గా ఉంచుతుంది.
అరటి పోషకాల నిధి అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అరటి పండ్లలో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి, బి 6, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం. గర్భిణీలు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుం., ఇది కొత్త కణాలను తయారు చేయడానికి, పుట్టబోయే బిడ్డలో ఏదైనా పుట్టుకతో వచ్చే లోపాలను తొలగించడానికి చాలా అవసరం. పిండం బాగా పెరగడానికి అరటిపండు మంచి పోషకాలను అందిస్తుంది.
అరటి పండు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిద్ర పోయేటప్పుడు ప్రతి రోజూ పాలు తాగి, అరటిపండు తినాలి. ఇలా చేయడం ద్వారా మలబద్ధకం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. అరటిపండు కూడా సంపూర్ణ ఆహారం. ఇది తక్షణ శక్తి బూస్టర్‌గా పని చేస్తుంది. ఇది అధిక గ్లూకోజ్ స్థాయిని కలిగి ఉంది. గ్లూకోజ్ శక్తికి ముఖ్యమైన పోషకం. మహిళలు రోజూ ఉదయం అరటిపండు తింటే వారికి రోజంతా శక్తి లభిస్తుంది. అవసరమైన పోషకాలు శరీర అవసరాలను కూడా తీరుస్తాయి.