Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుఖనిద్ర అందరికీ అవసరమే. మనం నిద్ర పోవాలంటే దిండ్లు కూడా అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచి ఆరోగ్యానికి తలగడలు మార్చాల్సిందే అంటున్నారు నిపుణులు. తలగడలను ఎక్కువ రోజులు వాడితే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం..
ఇంట్లో తలగడ కవర్లు మార్చితే సరిపోదని, తలగడలను కూడా మార్చాలి. మీ ఇంట్లో తలగడలను కనీసం రెండేండ్లకు ఒకసారైన మార్చాలి. ఎందుకంటే అందులో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. దుమ్ము-దూళి, చివరికి మన చెమట వల్ల పురుగులు కూడా పెరుగుతాయి. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఒక వ్యక్తి ఏడాదికి తన ముఖం నుంచి నాలుగు కిలోల వేస్టేజ్ (చెమట, ఇతర ధూళి)ని వదులుతారు. అదంతా తలగడలోకే చేరుతుంది. అవి సూక్ష్మ ధూళి పురుగులకు ఆహారంగా మారుతుంది. ఒక్క దూళి పురుగు రోజుకు సుమారు 200 సార్లు విసర్జిస్తాయి. అంటే.. కాలం పెరిగేకొద్ది అవి ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఆయిల్ లేదా చెమట వల్ల దిండ్లపై పడే మరకలు కూడా ప్రమాదకరమైనవే. ఆ మరకలు క్రమేనా తలగడలో అచ్చులుగా మారతాయి. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దిండ్లను కూడా మార్చండి. లేదా.. డేటాల్ వంటి బ్యాక్టీరియాలను చంపే ద్రవాల్లో నాబెట్టి.. ఉతికి ఆరేయండి. దానివల్ల కనీసం కొంతవరకైనా బ్యాక్టీరియా నశిస్తుంది. తలగడ మాత్రమే కాదు మనం వాడే పరుపులకు కూడా ఈ ముప్పు ఉండవచ్చు. కాబట్టి పరిశుభ్రంగా ఉండండి. ఆరోగ్యంగా జీవించండి.