Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు రాలడం ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ఇటీవల చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కలబంద వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిగడ్డ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ నూనె తయారీకి ఉల్లిగడ్డను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిగడ్డ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత కలబంద పేస్ట్‌ను , కొబ్బరి నూనెతో ఉల్లిగడ్డ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా, మందంగా, పొడవుగా బలంగా కనిపిస్తుంది. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పూయడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు కూడా ఒకటి. సరైన పోషకాలను అందించకపోతే చుండ్రుతో సహా ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిగడ్డ రసాన్ని ప్రయత్నించండి. ఉల్లిరసం తీసుకొని, అందులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ తలతో సహా జుట్టు అంతా రాయండి. ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అంతేకాకుండా మంచి ఆహారం కూడా మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.