Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. అది డబ్బు వల్ల వస్తుంది అని డబ్బు వెనక పరుగెడతాం. వస్తువులు పోగు చేస్తాం. ఏం చేయాలో అవి చేస్తాం. అయినా సంతోషం మాత్రం ఆమడదూరంలో ఉంటుంది. అందుకే ఈ రోజు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
పాజిటీవ్‌గా ఉండటం చాలా ఈజీ. ఎప్పుడూ నెగెటీవ్ ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకోండి.
ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలం. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయండి.
మంచి పోషకాహారం తీసుకోండి. నీరసం దరి చేరదు. నీరసం రానప్పుడు సంతోషం మీ సొంతం అవుతుంది.
నిత్యం నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. ముఖంపై ఒక చిరునవ్వు కలిగి ఉండండి.
ధ్యానం చేస్తే జీవితంలో ఉన్న ఒత్తిడి అనవసర టెన్షన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది. మీ జీవితం ఆనందం వైపు సాగుతుంది.