Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మందికి గర్భం ధరించడం చాలా సులభం. అయితే మరి కొందరిలో ఇది చాలా కష్టం అని చెప్తున్నారు నిపుణులు. అలాంటి వారు పిల్లల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా తల్లి కావడం లేదని బాధపడుతుంటారు. దీనికి అనేక సమస్యలు కారణమవుతుంటాయి. చాలామంది డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకుంటారు. కానీ జీవన విధానంలో మార్పులు మాత్రం చేసుకోరు. అలాంటప్పుడు ఫలితం ఉండదంటున్నారు నిపుణులు. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 15 శాతం మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైగా రోజు రోజుకూ ఈ శాతం పెరుగుతూ వస్తోంది. అయితే వీరిలో ఫెర్టిలిటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. దీనిపై అవగాహన కూడా చాలా మందికి ఉండదు. అయితే ప్రెగెంట్ అవ్వక పోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధులు, డ్రగ్స్, జీన్స్, లైఫ్ స్టైల్, అలవాట్లు లేదా కొన్ని కెమికల్స్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. చాలా మంది తెలియకుండా చేసే తప్పులు, అలవాట్లు వల్ల కూడా ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్య రావచ్చు. అయితే ఈ పొరపాట్లను మొదట్లో చిన్నవే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దీని కారణంగా అది ఇంఫెర్టిలిటీకి కారణం అవ్వచ్చు. చెప్పాలంటే వీటిని అదుపు చేయడం చాలా కష్టం. అలానే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువై పోతాయి. అందుకే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చిన్నదే కదా అనుకుంటే అదే పెద్ద ప్రమాదం అవ్వచ్చు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ వెళ్లడం చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.
హానికరమైన కెమికల్స్
కెమికల్స్ కూడా మనకు ఈ సమస్య తెచ్చిపెడతాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. చెప్పాలంటే ఈ కెమికల్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది. మనం ఇళ్లలో అనేక రకాల కెమికల్స్‌ను ఉపయోగిస్తుంటాం. పైగా బయటకు వెళ్ళినప్పుడు కూడా కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాము. కొన్ని కెమికల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే కెమికల్స్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇండిస్టియల్ కాంపౌన్డస్ కూడా భార్య భర్తలపై ప్రభావం చూపుతుంది. దీంతో పిల్లలు కలగకుండా ఉండడానికి అది దోహద పడుతుంది అయితే హానికరమైన కెమికల్స్ తరచూ ఎఫెక్ట్ అవడం వల్ల 29 శాతం ప్రెగెంట్ అవ్వడానికి ఛాన్సులు తగ్గిపోతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కెమికల్స్‌కి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇంటి పని చేస్తున్నప్పుడు, బ్యూటీ ప్రొడక్ట్స్ మొదలైన వాటిలో కూడా ఈ కెమికల్స్‌ని మీరు చెక్ చేసుకోండి. అన్నిటిలోనూ ఈ మధ్య కాలంలో కెమికల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతి దాంట్లో కెమికల్ ఫ్రీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల సమస్య బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఒత్తిడి
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఒత్తిడి మనలో బాధని పెంచుతుంది. పనులు కూడా చేయడానికి వీలు లేకుండా చేస్తుంది. నేటి కాలంలో ఇది అందరిలోనూ ఎక్కువై పోయింది. గర్భం ధరించలేకపోవడానికి ఈ ఒత్తిడి కూడా ఓ కారణంగా మారింది. అదుకే మీరు తల్లి కావాలని భావించినప్పుడు సాధ్యమైనంతక వరకు ఒత్తిడిని మీ దరికి చేరకుండా చూసుకోంది. ఒత్తిడి వల్ల హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. దాంతో గర్భధారణ కష్టంగా మారుతుంది. ఇది పురుషుల్లో మహిళల్లో కూడా ఇబ్బంది నిస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఒత్తిడిని తొలగించుకోవడంకి వ్యాయామం, మెడిటేషన్ లాంటివి ప్రయత్నం చేయండి. అలానే ఒత్తిడి కలిగించే వాటిని పక్కన పెట్టడం వల్ల కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎలాంటి సమస్యనైనా ఆలోచిస్తే సులువుగా పరిష్కరించుకోవచ్చు. అంతే కానీ కంగారు పడకండి. ఇలా మీరు ఒత్తిడిని తగ్గించుకుంటూ వస్తే ఏ ఇబ్బందులు ఉండవు.
కాఫీ ఎక్కువగా తీసుకోవడం
కాఫీ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. చిన్న కప్పు కాఫీనే కదా అని పది సార్లు తాగుతూ ఉంటే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏది ఏమైనా కాఫీ అతిగా తాగడం ప్రమాదకరం. కేవలం కాఫీనే కాదు ఏదైనా సరే అతిగా తీసుకుంటే ప్రమాదం వస్తుంది. అతిగా కాఫీ తీసుకునే అలవాటు మీకు ఉంటే దానిని వెంటనే మానుకోండి. ముఖ్యంగా మహిళల్లో ఇది తీవ్రమైన సమస్యకి గురి చేస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని రిస్క్ ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా కాఫీ తీసుకోవడం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా తక్కువగా కాఫీ తీసుకోవడం మంచిది. రోజుకు రెండు కప్పులు దాటిందంటే అది ప్రమాదం అని గ్రహించండి.