Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని నియమాలు పాటించి షాపింగ్‌లు చేయడం మంచిది. దీంతో సమయంతోపాటు.. డబ్బు ఆదా అవుతుంది. షాపింగ్‌లకు వెళ్లినపుడు ఆఫర్ ఉన్న ప్రతి వస్తువు కొనకుండా.. కేవలం మీకు ఏది కావాలో అదే కొనుక్కోండి. అది ఇంటి దగ్గరే లిస్ట్ రెడీ చేసుకోవాలి. దీనివల్ల టైంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.
లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత షాపింగ్ వెళ్లి ఆఫర్ ఉన్న వస్తువు కాకుండా మీ జాబితాలో ఉన్నవి తీసుకోవాలి. అనవసర వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. బడ్జెట్లో వచ్చే వస్తువులనే కొనుగోలు చేయాలి. మీ లిస్ట్ పూర్తయిన తర్వాత ఎక్కడ తక్కువ ధరల్లో లభిస్తాయో ఆన్లైన్ వివిధ పేపర్లలో వెతకాలి. దీనికి ఇరుగుపొరుగు వారి సమాచారంపై కూడా ఆధారపడవచ్చు.
సాధారణంగా అన్ని సంస్థలు పండగ సమయంలో ఆఫర్లను భారీగా ప్రకటిస్తాయి. ఇక్కడ కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ వస్తువులు కొనే ముందు వస్తువు తయారు చేసిన సమయం ఎక్స్పైరీ డేట్‌ను చూసుకోవాలి. కానీ ఈ ఆఫర్లు ఇప్పుడు ఏడాది మొత్తం కనిపిస్తున్నాయి. వారంలో ఏదో ఒకరోజైనా ఆఫర్లను ప్రత్యేకంగా ఇస్తున్నారు. అందుకే అవకాశం మళ్లీ రాదేమోనని ఆందోళన పడవద్దు. ఇక రాబోయేది పండుగ సమయం కాబట్టి సహద్యోగులతో కలిసి ఓ నలుగురు అయిదుగురు బల్క్‌లో కొనుక్కోవాలి.
కరోనా సమయం నుంచి ఎక్కువ శాతం ఆన్లైన్ చెల్లింపులకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే షాపింగ్ సమయంలో ఎక్కువ శాతం మీ వద్ద ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. ఈ సంస్థలు కూడా కొద్ది మొత్తం షాపింగ్‌పై కూడా రాయితీలను ప్రకటిస్తారు. అందుకే దీని వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. ఎలాగైనా.. పండగ సమయంలో బ్యాంకులు కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను కూడా అందిస్తుంది. ఈ రివార్డు పాయింట్లతో గిఫ్ట్ వోచర్లను కూడా పొందవచ్చు.