Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో ఆరోగ్య రంగం విప్లవానికి చేరువలో ఉంది. ఇటీవలి విడుదలైన ఓ నివేదిక ప్రకారం భారతదేశ ఆరోగ్య సాంకేతిక పర్యావరణ వ్యవస్థ 2033 నాటికి మార్కెట్లో 50 కోట్లకు చేరువకానుంది. 2020 నుండి 2023 మధ్య 39 శాతం పెరుగుతోంది. ఈ అద్భుతమైన అభివృద్ధి వెనుక ఉన్న ప్రధాన అంశాలలో ఒకటి టెక్ స్టార్టప్‌లు. వీరు భారతదేశంలోని ప్రధాన ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో రాబోయే కాలంలో మహిళా పారిశ్రామికవేత్తలకు రోల్ మోడల్స్‌గా నిలిచిన వారి కృషి ఎంతో ఉంది. వారిలో ఆరుగురు మహిళల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం...
సరైన చికిత్స కోసం...
మన దేశంలో శిక్షణ పొందిన రేడియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. 10,000 మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అంచనా. అనారోగ్యం నిర్ధారణ, చికిత్సకు రేడియాలజీ నివేదికలు కీలకమైనవి. కాబట్టి ఆటోమేషన్తో రేడియాలజిస్టులపై భారాన్ని తగ్గించడం అత్యవసరం. హెల్త్‌కేర్ సాధించడమే సినాప్సికా లక్ష్యం. ''లోతైన, అత్యంత తొందరగా రేడియాలజీ నివేదికల ద్వారా రోగికి చికిత్స చేయడం తేలికవుతుంది. అయితే చిన్న చిన్న డయాగ్నొస్టిక్ సెంటర్ల నుండి వచ్చిన రిపోర్టులను మరోసారి పరిశీలించకుండానే చాలా మంది చికిత్స చేస్తున్నారు. అలాంటి వారికి సహాయపడాలనే లక్ష్యంతో మేము ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాము'' అని ఆమె చెప్పారు. నేడు 500 మందికి పైగా రేడియాలజిస్టులు సినాప్సికా క్లౌడ్ సొల్యూషన్‌ను తమ చికిత్సకు సురక్షితమైన మార్గంగా నమ్ముతున్నారు. రేడియాలజిస్టులు ఏ పరికరం నుండి అయినా, ఇమేజింగ్ సైట్లలో ఎక్కడైనా నివేదించ గలరు. క్లిష్టమైన స్కాన్లను పరీక్షిం చడం, ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆసుపత్రిలో చికిత్సను మరింత సులభం చేస్తున్నారు.
రాబోయే రెండు సంవత్సరాలలో సినాప్సికా క్లినికల్ డయాగస్టిక్స్లోని అన్ని రేడియాలజీ కేసులలో 60శాతంకి ఆటోమేషన్‌ను తీసుకురావాలని, తన పనిని మరింత వేగవంతం చేసి కచ్చితమైన రోగ నిర్ధారణకు సహాయపడే మరిన్ని కొత్త నివేదికలను రూపొందించాలని యోచిస్తోంది. వారి టెక్ టీమ్ ఏడబ్ల్యూఎస్పై ఆధారపడి ఉంటుంది. వినియోగదారులకు మరింత భద్రతను అందిస్తుంది.
- మీనాక్షి సింగ్, సినాప్సికా హెల్త్‌కేర్
వైద్యం మాత్రమే కాదు
ఫార్మసిస్ట్, ఎంబీఏ చేసిన ఖుష్బూ అగర్వాల్ కాలిఫోర్నియాలో కన్సల్టింగ్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు ఆమె తండ్రికి డయాబెటిస్ కారణంగా గుండె జబ్బు వచ్చింది. తర్వాతి ఆరు నెలల్లో ఖుష్బూ రోగుల నిస్సహాయత, వారిపట్ల సంరక్షకులు జవాబుదారిలేకుండా పని చేయడం గమనించింది. ''భారతదేశంలో దీర్ఘకాలిక రోగి వారి ఆరోగ్యం కోసం సంవత్సరానికి రూ.15,000 నుండి 50,000 వరకు ఖర్చు చేస్తున్నారు. రకరకాల సమస్యతో ఆసుపత్రిలో చేరుతున్నారు. వారిలో 80శాతం మంది గుండెపోటు లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. రోగి ఆరోగ్యానికి జవాబుదారీతనం వహించే ఏ ఒక్క సంస్థ కూడా లేదు'' అని ఆమె చెప్పింది. ఈ అంతరాన్ని తగ్గించడానికి ఖుష్బూ 2017లో జైలా హెల్త్‌ను స్థాపించారు. నేడు జైలా మధుమేహం నుండి గర్భం వరకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందం కింద రోగికి సరైన చికిత్స అందించడం జైలా లక్ష్యం. 50 వేలకు పైగా వైద్య సదుపాయలను అది అందిస్తుంది. కేవలం వైద్యానికి సంబంధించి మాత్రమే కాకుండా రోగి జీవనశైలిలో రావల్సిన మార్పులను కూడా వివరిస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలోని 595 నగరాల్లో రెండు లక్షల మంది రోగుల జీవితాలను మార్చడంలో జైలా కీలక పాత్ర పోషించింది. ''2025 నాటికి 50 లక్షల మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము'' ఖుష్బూ చెప్పారు.
- ఖుష్బూ అగర్వాల్, జైలా హెల్త్
పిసిఓఎస్కు పరిష్కారం
శోభిత పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) లక్షణాలతో ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వైద్య సలహాలు, రోగ నిర్ధారణ, చికిత్స ఆమెను కలవరపెట్టాయి. అప్పుడే శోభిత ఆమె సోదరి శాశ్వతతో పాటు చాలా మంది మహిళలకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయని గ్రహించారు. శోభిత జీవశాస్త్రం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ చేసింది. తర్వాత ఆరోగ్య సంరక్షణలో తన కెరీర్‌ను కొనసాగింది. శాశ్వత ఎంబిఏ పూర్తి చేసి ఫైనాన్స్, మార్కెటింగ్ సంస్థలలో పనిచేసింది. వారి వ్యక్తిగత పరిచయాలు వృత్తిపరమైన అనుభవాలతో నరేయిన్ సోదరీమణులు వీర హెల్త్ ప్రారంభించి విభిన్న లక్ష్యలను పెట్టుకున్నారు. డిజిటల్ థెరప్యూటిక్స్ ప్లాట్‌ఫారమ్‌గా, వైద్యులు, పోషకాహార నిపుణులు, జీవనశైలి కోచ్‌లకు రోగ నిర్ధారణ చేయడానికి, పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి, వ్యక్తిగతీకరించిన చికిత్సలను అందించడంలో సహాయపడటం ద్వారా పీసీఓడిని గుర్తించడం, తగిన చికిత్స అందించడం సాధ్యమవుతుంది. దీన్ని ప్రారంభించిన ఓ సంవత్సరంలోనే అద్భుతమైన సానుకూల స్పందనను ఈ అక్కచెల్లెళ్ళు చూశారు. ''మా సభ్యులలో 85శాతం ఒక నెలలోపు వారి పీసీఓఎస్ నియంత్రణలో ఉన్నట్టు చెప్పారు'' అని శాశ్వత పంచుకున్నారు. 'చాలామంది మహిళలు తమ పిసిఒఎస్ స్థితిని అంచనా వేయడానికి ఆరు నెలలకు ఒకసారి క్లినిక్‌కి వస్తుంటారు'' అని ఆమె జతచేస్తుంది.
- శోభిత నరేయిన్, శాశ్వత నరేయిన్ - వీర ఆరోగ్యం
మందుల భారం తగ్గిస్తుంది
ఆరోగ్యఏఐ 2019లో ప్రారంభమైంది. డాక్టర్ ప్రాప్తి జయస్వాల్ అప్పుడే పీహెచ్డీ పూర్తి చేశారు. తన పరిశోధనా పనిని పూర్తి చేసిన తర్వాత అవలోకిత తివారీ జపాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇద్దరు సహ వ్యవస్థాపకులుగా వాస్తవ ప్రపంచ సమ స్యలను పరిష్కరిం చడానికి తమ విద్య ను ఉపయో గించారు. క్షయవ్యాధిలో ఉపయోగించే మందుల కోసం పనిచేయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధిక క్షయ వ్యాధి కేసులు భారతదేశంలో నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనికి వాడే మందుల భారం నాలుగింట ఒక వంతు ఉంటుంది. వ్యాధి నిర్ధారణ వారాలు పడుతుంది. వీరిద్దరూ ఆరోగ్యఏఐ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఇది కొన్ని గంటల్లో వ్యాధిని నిర్ధారించడానికి జన్యుశాస్త్రం, కృత్రిమ మేధస్సును ఉపయోగిం చుకుంటుంది. రోగులకు కచ్చితమైన రోగ నిర్ధారణ, సమర్థవంతమైన మందులను అందించేలా చూస్తూ వారికి తాజా సాంకేతికతతో సహాయపడుతుంది. తొందరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగి ఆరోగ్యం క్షీణించడాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా రోగికి, ప్రభుత్వానికి అదనపు వ్యయాన్ని కలిగించదు.
ఆరోగ్యఏఐలో వ్యాధి నిర్థారణ చాలా సులభం. డేటా ఆధారిత చికిత్స ఇవ్వడంలో వైద్యులకు సహాయం చేస్తుంది. మైకోబాక్టీరియం క్షయవ్యాధిలో ఔషధ నిరోధకతను అందించే కొత్త పరికరాలను సృష్టించడంలో ఈ ప్లాట్‌ఫాం నిరంతరం నేర్చుకుంటుంది. నేడు కోవిడ్ -19 మహమ్మారితో వ్యవస్థాపకులు తమ నైపుణ్యాన్ని, కోవిడ్ జన్యు విశ్లేషణ కోసం పైప్‌లైన్ నిర్మించడానికి టెక్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించుకున్నారు. ''మేము ఇప్పుడు టిబికి మించిన టెక్నాలజీ ద్వారా వ్యాధి పరిష్కార పరిధిని విస్తరిస్తున్నాము'' అని ప్రాప్తి చెప్పారు.
- డాక్టర్ ప్రాప్తి జయస్వాల్, అవలోకిత తివారీ - ఆరోగ్యఏఐ
సవాళ్లు ఎదుర్కొంటూ
అత్యంత కీలకమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంలో ఈ మహిళా పారిశ్రామికవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. అనేక సవాళ్ళతో కూడిన వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తి దాయకం. ''ఆరోగ్య సంరక్షణలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఎల్లప్పుడూ పరిస్థితిపై మరింత అవగాహన కల్పించడం'' అని వీరా వ్యవస్థాపకులు చెప్పారు. ''పీసీఒఎస్ వంటి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చాలా అపోహలు, తప్పుడు సమాచారం ఉంది. ఇది అవగాహనను కల్పించడం కష్టతరం చేస్తుంది'' అని వారు చెప్పారు.
- సలీమ