Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్రలేచిన వెంటనే ముఖాన్ని ఐస్‌క్యూబ్‌తో చేసే మదువైన మర్దన రక్త ప్రస రణను మెరుగుపరుస్తుంది. అలాగే మేకప్ వేసుకునే ముందు దీంతో చేసే మసాజ్ ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది. ఐస్క్యూబ్కు మరిన్ని సహజసిద్ధ పదార్థాలను కలిపి ఫ్రీజ్ చేస్తే ముఖారవిందానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి.
గుప్పెడు తులసి ఆకులకు కప్పు నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్‌క్యూబ్‌తో చేసే మర్దనా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.ముప్పావుకప్పు కాచిన పాలల్లో పావు కప్పు నీటిని కలిపి ఐస్ ట్రేలో నింపాలి. ఫ్రీజ్ అయిన ఈ క్యూబ్స్‌తో మర్దనా చేస్తే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది.
వెడల్పైన సీసాలో శుభ్రం చేసిన అరకప్పు బియ్యం వేసి రెండు కప్పుల నీటిని నింపాలి. దీన్ని నాలుగు గంటలు నాననివ్వాలి. తర్వాత వడకట్టిన ఆ నీటిని ఐస్‌క్యూబ్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేయాలి. వీటితో రోజూ ఉదయాన్నే ముఖాన్ని మదువుగా మసాజ్ చేసుకుంటే ముఖచర్మం ఆరోగ్యంగా మారుతుంది.