Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు లక్ష్యాలు నిర్దేశించుకునే వరకూ, వాటిని చేరుకునే వరకూ ఉత్సాహంగా ఉంటారు. ఆ తర్వాతే నీరుగారిపోతారు. అలా కాకుండా ఉండాలంటే... ఆశయంతో పాటు ఆలోచన, ప్రణాళిక కూడా ఉండాలి.
ప్రతి ఒక్కరికీ జీవితంలో లక్ష్యం అంటూ ఉండాలి. అవి లెక్కకు మించి కూడా ఉండొచ్చు. వీటిని దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలుగా విభజించుకోవాలి. వాటి సాధనకు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా? ఏం చేస్తున్నా? ఏం చేయాలనుకుంటున్నా? గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి వంటి వాటిపై అవగాహన ఉండాలి. వీటిపై స్పష్టత ఉంటేనే మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి.
కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు చాలా విషయాలు తెలియవు. కాబట్టి ఒక్కోటీ తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం పని వేళల కంటే కాస్త ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే మీరు తెలుసుకోవాలనుకునే, శోధించాలనుకునే విషయాలపై దష్టి పెట్టాలి... కష్టపడాలి. అప్పుడే కెరియర్లో దూసుకెళతారు.
కష్టపడి పనిచేసే అలవాటు ముందు నుంచి ఉండాలి. అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేయడానికీ వెనుకడుగు వేయకూడదు. మీకు ఇచ్చిన అంశంలో జరిగే పరిణామాలపై అప్డేట్గా ఉండాలి. అవసరమైతే సాంకేతికంగా, మరే రకంగానైనా మీ నైపుణ్యాలను అభివద్ధి చేసుకోవాలి. నిత్య విద్యార్థిలా ఉండాలి. నిరంతరం శోధన కొనసాగుతూనే ఉండాలి.