Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటు అందం, అటు ఆరోగ్యం.. రెంటినీ సొంతం చేసే సుగుణాలెన్నో గ్రేప్ జ్యూస్‌లో ఉన్నాయి. కాబట్టి.. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం...
వయసును దాచిపెడుతుంది: ద్రాక్షపండ్లలో ఎ, సి, బి-6 వంటి విటమిన్లు సమద్ధిగా లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వ్కెరల్ గుణాల కారణంగా ఇవి మన శరీరంలో వ్యాది నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. అంతేకాదు.. జలుబు, దగ్గు, ఫ్లూ.. వంటి ఆరోగ్య సమ స్యలు రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయసు పైబడిన కొద్దీ శరీరంపై ముడతలు రాకుండా నివారిస్తాయి.
గుండెకు కొండంత అండ: ద్రాక్షరసం వల్ల శరీరంలో న్కెట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తయి తద్వారా రక్తనాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు మన దరిచేరవు.
అదుపులో కొలెస్ట్రాల్: ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగితే చాలు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు.. ఇది ధమనుల్లో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
స్త్రీలకెంతో మేలు: ప్రెగెన్సీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కొందరు ఈ సమయంలో చాలా బలహీనంగా ఉంటారు. అలాంటి వారికి కాన్పు సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. దీన్ని అధిగమించాలంటే ద్రాక్షపండ్లు తినడం లేదా ద్రాక్షరసం తాగడం చాలా అవసరం. ద్రాక్షతో.. ఈ సమయంలో తరచుగా ఎదురయ్యే అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు ప్రెగెంట్ వుమెన్‌కు వీటివల్ల చాలా మేలు కలుగుతుంది.
క్యాన్సర్ రాకుండా: ద్రాక్షరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణుతులు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ప్రత్యేకించి పర్పుల్ రంగులో ఉన్న ద్రాక్షరసమైతే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
ఎముకలను దఢపరుస్తుంది: ద్రాక్షరసంలో కాపర్, ఐరన్, మాంగనీస్.. వంటి మైక్రో న్యూట్రియంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎముకలను దఢంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ ఒక గ్లాస్ ద్రాక్షరసాన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
అజీర్తి నుంచి ఉపశమనం: ద్రాక్షరసం.. అజీర్తి సమస్య నుంచి ఉప శమనం కలుగ జేస్తుంది. ద్రాక్షరసం లో ఉండే సహజ సిద్ధమైన లాక్సేటివ్ గుణాల వల్ల జీర్ణవ్యవస్థ, పేగువ్యవస్థలు అదుపులో ఉండి.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.
తక్షణ శక్తికి: సాధారణంగా అలసటను దూరం చేసుకోవడానికి ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటాం. ఓసారి వీటికి బదులుగా ఒక గ్లాసు తెల్ల ద్రాక్షరసాన్ని తాగి చూడండి.. తక్షణ శక్తి మీ సొంతమవుతుంది. ఈ ద్రాక్షలో ఉండే ఐరన్, ఫ్లావనాయిడ్స్.. లాంటి యాంటీఆక్సిడెంట్ల వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. శరీరంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు లోపిస్తే తలనొప్పి, ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరికొన్ని ఉపయోగాలు
ఆస్తమాతో బాధపడే వారికి ద్రాక్ష మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ద్రాక్ష రసం పార్శ్వపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కడుపు నొప్పితో బాధపడేవారు ద్రాక్షరసం తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కంటి, పంటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా ఉపశమనాన్ని కలుగజేస్తుంది.
ద్రాక్షనూనెను సుగంధ ద్రవ్యాల్లోనూ ఉపయోగిస్తారు.
శరీరంపై అలర్జీలు రాకుండా చేస్తుంది.