Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతికేది ఎట్లాగె ఉయ్యాలో
భారత దేశాన ఉయ్యాలో
బాలికల బతుకులే ఉయ్యాలో
బాలికల బతుకులే ఉయ్యాలో
బాధల బతుకులే ఉయ్యాలో
బచావో అన్నారు ఉయ్యాలో
పడావో అన్నారే ఉయ్యాలో
ఎక్కడ బచావో ఉయ్యాలో
ఎక్కడ పడావో ఉయ్యాలో
ఉత్తరాఖండాన ఉయ్యాలో
సన్నాసి రాజ్యమే ఉయ్యాలో
ఆ రాజ్యంలోన ఉయ్యాలో
చిన్నారులెందరినో ఉయ్యాలో
చిదిమిసినారమ్మ ఉయ్యాలో
దక్షిణాదిలోన ఉయ్యాలో
దయలేని పాలకులు ఉయ్యాలో
మద్యమమ్మకాలు ఉయ్యాలో
మాదకద్రవ్యాలే ఉయ్యాలో
చెల్లి చైత్రనే ఉయ్యాలో
బలిదీసుకున్నారు ఉయ్యాలో
మద్యమే లేకుంటె ఉయ్యాలో
రాజ్యమె లేదంట ఉయ్యాలో
బాలికల రక్షించ ఉయ్యాలో
రుద్రమ్మ వలెనీవు ఉయ్యాలో
నిద్ర లేవాలమ్మ ఉయ్యాలో
ఐద్వా సంఘమై ఉయ్యాలో
ఆడోళ్ళ సంఘమట ఉయ్యాలో
ఆ సంఘమునందు ఉయ్యాలో
మనమంత జేరి ఉయ్యాలో
బతుకుల్ని కాపాడ ఉయ్యాలో
ఉదయమ్మవై కదులు ఉయ్యాలో
స్వరాజ్యమై నీవు ఉయ్యాలో
గర్జించవమ్మా ఉయ్యాలో
ఐలమ్మవై నీవు ఉయ్యాలో
పోరు చేసినీవు ఉయ్యాలో
దుండగులనెదిరించు ఉయ్యాలో
దొరలతరిమినట్టు ఉయ్యాలో
దుష్టులను తరమంగ ఉయ్యాలో
దుర్గవై లేవే ఉయ్యాలో
కమలమ్మవై నీవు ఉయ్యాలో
కన్నెర్ర జెయ్యాలె ఉయ్యాలో
అప్పుడే మన బతుకు ఉయ్యాలో
మారునే చెల్లెల ఉయ్యాలో
- బత్తుల హైమావతి
రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఐద్వా