Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజీ జీవితంలో చాలామంది సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. పని ఒత్తిడి, మానసిక చికాగుల కారణంగా చాలా మంది నిద్రలేమితో భాదపడుతున్నారు. దాంతో అనేక అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే కంటి నిండా నిద్ర ఎంతో అవసరం. నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. అంతేకాక రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. సరైన నిద్ర మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ నుండి మన మానసిక స్థితి వరకు అన్నింటిపై నిద్ర ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి. అయితే హాయిగా నిద్ర పట్టాలంటే కొన్ని పద్దతులు తప్పక పాటించాలి.
వ్యాయామం చేయండి: మీరు నిద్రపోయే రూమ్ చల్లగా, చీకటిగా ఉండేటట్లు చూసుకోండి. బెడ్రూమ్ కిటికీలకు హెవీ కర్టెన్స్ ఉపయోగించండి. డిమ్ నైట్లైట్ని హాల్లో కానీ, బాత్రూమ్ ముందు కానీ యూజ్ చేస్తే రాత్రి పూట లేచినా ఇబ్బంది ఉండదు. వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ వలన బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా మంచి నిద్ర కూడా వ్యాయామం వలన సాధ్యపడుతుంది. సూర్యాస్తమయం నుంచి కెఫీన్, నికోటిన్ తగ్గించండి. ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. ఫలితంగా నిద్ర పట్టదు.
ఎక్కువ తినొద్దు: రాత్రి హెవీగా తినకండి. ఒకవేళ తిన్నా రెండు గంటల వరకూ నిద్రపోకండి. రిఫైండ్ కార్బ్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని వర్క్ చేసుకోవడం వంటి పనుల వల్ల బ్రెయిన్ బెడ్ని నిద్రకి ఎసోసియేట్ చేయలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన బెడ్రూమ్లోనే పని చేసుకోవలసి వస్తే బెడ్ మీద కూర్చుని కాకుండా పక్కన ఇంకో అరేంజ్మెంట్ చేసుకోండి.
ఒకే సమయానికి: రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి ఒకే సమయానికి లేచే అలవాటు చేసుకోండి. వీకెండ్స్ అయినా సరే ఈ టైమింగ్స్ మాత్రం మార్చకండి. అలాగే సూర్యోదయానికి ఎంత దగ్గరగా నిద్ర లేస్తే అంత మంచిది. వీలున్నంత వరకూ పగలు కునుకు తీయకండి. తప్పదనిపిస్తే ఒక్క పావుగంట మించి నిద్రపోకండి. నిద్ర పోయే సమయం కంటే ముందే మీకు మత్తుగా అనిపిస్తే వెంటనే పడుకోకండి. మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఫ్రెండ్‌కి కాల్ చేయడమో, మరుసటి రోజుకి కావాల్సిన బట్టలు తయారుగా పెట్టుకోవడమో వంటి పనులు చేయండి. పగలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. బాల్కనీలో కూర్చుని కాఫీ తాగండి. బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు డైనింగ్ రూమ్ విండో ఓపెన్ చేసేయండి. వర్క్‌లో బ్రేక్స్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బయటకి రండి.