Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమేమి నీకొప్పునే బతుకమ్మ
ఏమేమి మాటొప్పునే
ఎలాంటి మనసొప్పునే గౌరమ్మ
ఎలాంటి చేతొప్పునే ||ఏమేమి||
అమ్మ కడుపులోన ఆపదలు లేకుండా
ఆనందముగా నేను
ఈలోకమును చూచు
పుట్టుకే నాకొప్పునే బతుకమ్మ
మంచి మాటయే నాకొప్పునే ||ఏమేమి||
పసిప్రాయమూలోన పాపాయిగా నేను
పసిడి కిరణంలాగ పకపకా నవ్వేటి
బాల్యమూ నాకొప్పునే బతుకమ్మ
బంగారు బాటయే నాకొప్పునే ||ఏమేమి||
శుక్లపక్షంలాగ ఎదిగేటి వయసులో
దిష్టి కన్నుల వల్ల దిగులునే పడకుండా
పరువాల వయసొప్పునే బతుకమ్మ
పచ్చనీ బతుకొప్పునే ||ఏమేమి||
అతి సులువుగా నేను
అక్షరాలందుకొని
నాలోన దాగున్న నైపుణ్యముల తోటి
నలుగురిలో పేరొప్పునే బతుకమ్మ
నాతిగా రూపొప్పునే ||ఏమేమి||
ఇలలోని సూర్యునిలా ఇంటింటి లోపల
వెలుగునూ ఇచ్చేటి వనితనూ నేనయ్యి
మగువగా మనసొప్పునే బతుకమ్మ
మానవత్వం ఒప్పునే ||ఏమేమి||
- వురిమళ్ల సునంద, ఖమ్మం
9441815722