Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలని అందరికీ ఉంటుంది. దానికోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్ట్స్‌ని వాడుతారు. వేలకు వేలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయినా ఫలితం ఉండడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. అయితే అందమైన చర్మం కోసం ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు...
చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరిసేలా సహయపడతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలం. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇవి తీసుకుంటే కచ్చితంగా శరీరం మెరిసిపోతుంది.
స్ట్రాబెరీలు, బ్లూబెర్రీస్ వంటివి కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. వీటిని బ్రెక్ ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. ఇవి యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు, విటమిన్స్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ర్యాషెస్, ముడతల సమస్యను తగ్గిస్తాయి.
బాదంలో విటమిన్ ఎ పుష్కలం. ఇది చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే రక్తహీనతను తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మచ్చలను తగ్గిస్తాయి.
చేపలు.. ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే చర్మానికి కూడా. ఇందులో ఉండే ఒమేగా 3, పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. సాల్మన్, సార్టినెస్ వంటి సముద్ర చేపలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని తింటే ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందొచ్చు.
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలం. అలాగే చర్మాన్ని మెరిసెలా చేస్తాయి. పాలకూర, బ్రోకలీ సెలెరీ, కొత్తిమీర వంటి కూరలు చర్మానికి మేలు చేస్తాయి. ఆకు కూరలు తీసుకోంటే అందమైన చర్మమే కాదు.. ఆరోగ్యం కూడా...
కేవలం ఆహారం తీసుకోవడమే కాదు.. చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మనం నవ్వినప్పుడు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చర్మానికి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. అప్పుడు ఆరోగ్యకరమైన మెరుస్తూ ఉండే చర్మం మీ సొంతమవుతుంది.
ఇక చర్మం అన్ని సమస్యలను తొలగించడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది. తగినంత నీరు తాగినప్పుడు ఇది శరీరం నుంచి వచ్చే టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కొన్ని రోజులు తగినంత నీరు తాగండి.