Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొబ్బరి నూనెలో కొన్ని వేప ఆకులు వేసి మరిగించిన తర్వాత దాన్ని కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేయాలి. దీన్ని సన్‌లైట్ పడని ప్రాంతంలో పెట్టుకోవాలి. రాత్రి నిద్రపోయే సమయంలో తలకు ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవాలి. ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది.
వేప, పెరుగు కలిపి చుండ్రును వదిలించుకోవడానికి హెయిర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వేప ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కాస్త పెరుగు కలుపుకుని తల మొత్తం పట్టించి 15 -20 నిమిషాల తర్వాత తలను బాగా కడిగేయండి.
కొన్ని వేపకులు తీసుకుని వాటిని మిక్సిలో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీంట్లో ఓ టీస్పూన్ తేనెను కలిపి జుట్టు మొత్తంగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత హెడ్‌బాత్ చేసుకోవాలి.
వేప హెయిర్ కండీషనర్ తయారు చేయడం చాలా సులభం. కొన్ని వేపాకులను నీటిలో బాగా మరిగించాలి. షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో మసాజ్ చేయాలి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.