Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్టీ లౌడర్ కంపెనీస్ (ఈఎల్‌సీ) రొమ్ము క్యాన్సర్‌ను అంతమొందించేందుకు సహాయపడటానికి ముందుకొచ్చింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గతంకన్నా బాగా పెరిగింది. ఓ అంచనా ప్రకారం 2.3 మిలియన్ నూతన కేసులు ఇప్పుడు ఉన్నాయి. అందుకే రొమ్ముక్యాన్సర్ రహిత ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలను ఏకంచేయడానికి ఈ కంపెనీ పూనుకుంది. ఈ ప్రచారంకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా సంస్ధలకు మద్దతునందించడంతో పాటుగా నిధులను సమీకరించడం, విద్య, మద్దతునందించడంతో పాటుగా రొమ్ము క్యాన్సర్ లేని ప్రపంచానికి మనల్ని దగ్గరగా చేస్తుంది. 99 మిలియన్ డాలర్లను అంతర్జాతీయంగా సమీకరించింది. ఈ నిధులను జీవితాలను కాపాడే పరిశోధన, విద్య, వైద్య సేవలు కోసం వినియోగిస్తారు.
ఈ అవగాహన క్యాంపెయిన్ అక్టోబర్ 01వ తేదీ నుంచి కొనసాగిస్తుంది.
ముందుగా వ్యాధిని గుర్తించడం పట్ల అవగాహన కల్పించడం, రొమ్ము ఆరోగ్య ఆవశ్యకతను తెలియజేయడం.
ఉద్యోగులు, రిటైల్ భాగస్వాములు, ఇన్ఫ్లూయెన్సర్లు, అంబాసిడర్ల కోసం విద్యా అవగాహన సమావేశాలు నిర్వహించడం.
రొమ్ము ఆరోగ్య ఆవశ్యకత పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ డాక్టర్లు, క్యాన్సర్ విజేతలతో అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
స్నేహితులు, భాగస్వాములు, సహచరులు, కొలీగ్స్ నడుమ డిజిటల్‌గా అంతర్జాతీయ బ్రోచర్లను డిజిటల్‌గా పంపిణీ చేయడంతో పాటుగా క్లింక్, బాబీ బ్రౌన్, ఎస్టీ లౌడర్ ఇండియా బ్రాండ్ వెబ్సైట్ల నుంచి ఆన్లైన్ కొనుగోళ్లను సైతం చేయవచ్చు.
శక్తివంతమైన అవగాహన కోసం నూతన సోషల్ కాల్ టు యాక్షన్ క్యాంపెయిన్
పింక్ రిబ్బన్ పవర్ టు యునైట్ స్ఫూర్తితో, ఈ క్యాంపెయిన్ ఉద్యోగులు, భాగస్వాములు, విజేతలు, బ్రాండ్ ప్రచారకర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లను ఒకే దరికి తీసుకువచ్చి పింక్ రిబ్బన్ అంటే వారికి ఏమిటనేది #TimetoEndBreastCancer #BCCIndia2021@esteelaudercompanies యాష్‌ట్యాగ్స్ ద్వారా తెలుపడం.
క్యాంపెయిన్‌కు సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ అంబాసిడర్ వ్యవహరిస్తున్న ఎలిజబెత్ హర్లే మాట్లాడుతూ ''బ్రెస్ క్యాన్సర్ క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ ప్రచారకర్తగా నా బాధ్యత, నా జీవితంలో అత్యంత అర్థవంతమైన పనిగా నిలుస్తుంది. ఎవ్లీన్ 1990లో ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన అనతికాలంలోనే నేను ఆమెతో కలిసిపనిచేసేందుకు చేరాను. ఈ క్యాంపెయిన్, అత్యంత శక్తివంతమైన ప్రభావం చూపడంతో పాటుగా ఎస్టీ లౌడర్ కంపెనీస్ ఇప్పుడు అత్యుత్తమమైన బ్రెస్ట్ క్యాన్సర్ కమ్యూనిటీగా నిలిచింది. పరిశోధన ద్వారా సాధించిన అద్భుతమైన పురోగతితో ఈ క్యాంపెయిన్ ఇప్పుడు అత్యాధునిక సైన్స్, చికిత్సలు, సంరక్షణకు నిధులను సమకూరుస్తుంది. మనమంతా తప్పనిసరిగా ఎవ్లీన్ వారసత్వం కొనసాగించడంతో పాటుగా క్యాంపెయిన్‌కు మద్దతునందించి ఈ వ్యాధికి తగిన చికిత్సనందించాలి'' అన్నారు.