Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ప్రతిరోజూ చేసే పనుల్లో బట్టలు ఉతకడం ఒకటి. దీన్ని రోజూ కాకున్నా.. రెండు మూడు రోజుల తర్వాత అయినా చేయక తప్పదు. బట్టలు ఊతికే తప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అవేంటో చూద్దాం...
కొంతమంది వారానికి ఒకేసారి బట్టలు ఉతకడానికి వాటిని పోగు చేస్తారు. ఆరోజు లేవడమే లేటుగా లేస్తారు. నిజానికి ఆ రోజు బాగా రెస్ట్ తీసుకుంటారు. చివరికి బట్టలు ఉతికే పని ఆరోజు కూడా పూర్తవ్వదు.
వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతకడం వల్ల అందులోనుంచి దుర్వాసన వస్తుంది. ప్రతి ఐదు మందిలో నలుగురు వాషింగ్ మెషిన్‌కు క్లీనింగ్ అవసరం లేదని అనుకంటారు. ఎందుకంటే దీనికి సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి అవసరం లేదు అనుకుంటారు.
అస్సలు ఎంత డిటెర్జంట్ వాడాలో తెలుసా? ఈ విషయం దాదాపు చాలా మందికి తెలియదు. ఒక్కోసారి ఎక్కువ మోతాదు లేదా అతితక్కువ మోతాదులో డిటర్జెంట్‌ను వాడతాం. ఇప్పటి వరకు కూడా చాలా మందికి సరైన కొలత ఎంతో తెలియదు.
బట్టలను శుభ్రం చేయడం వేరు వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేయడం వేరు. క్లీనింగ్ చేయడం వల్ల కేవలం బట్టల మురికి మాత్రమే పోతుంది. డిస్ఇన్ఫెక్ట్ ద్వారా జెర్మ్స్ పోతాయి. డిటెర్జంట్ చేసిన తర్వాత రెండు కప్పుల డిస్ఇన్ఫెక్షన్ లిక్విడ్‌ను వాడటం సురక్షితం. డెట్టల్ వంటివి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో మీ బట్టలు ఫ్రెష్‌గా సువాసనభరితంగా ఉంటాయి. మెషిన్లో ఎక్కువరోజులు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి ఉతికినే ఉపయోగం ఉండదు.
తెల్లటి బట్టలను వేరుగా పెట్టడం చాలా మంచిది. వీటికి వేరే బట్టల రంగు అంటకుండా ఉండాలంటే వేరు చేయాల్సిన అవసరం ఉంది. మిషన్‌లో వేసేటప్పుడు బట్టలు తిప్పి వేయాలి. ఎందుకంటే చెమట, మురికి మన శరీరంలో నుంచి వచ్చింది లోపలివైపే ఉంటుంది. కాబట్టి వాటిని క్లీన్ చేసేటపుడు తిప్పి వేయాలి.