Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి: పోరు పోరమ్మ ఉయ్యాలో.. బతుకు పోరమ్మ ఉయ్యాలో
బంగారు తెలంగాణ కావలె ఉయ్యాలో.. జహుజన పోరమ్మ ఉయ్యాలో
చరణం: సద్దు లబతుకమ్మ సంబరం ఉయ్యాలో.. సుద్దులే చెప్పింది ఉయ్యాలో
ఆడపిల్లమ్మ ఉయ్యాలో.. ఆడే పిల్లమ్మ ఉయ్యాలో...
పాడే పిల్లమ్మ ఉయ్యాలో.. తోడు నీడమ్మ ఉయ్యాలో...
అమ్మకే అమ్మై పుట్టాలె ఉయ్యాలో... ఆడబిడ్డే గొప్ప ఉయ్యాలో ||పోరుపోరమ్మ||
చరణం: పుష్పించి మొగ్గొలె ఉయ్యాలో... మా కంటి వెలుగమ్మ ఉయ్యాలో...
కడుపు పండింది ఉయ్యాలో.. ఉమ్మనీటి ఉసురే తోస్తుండు ఉయ్యాలో...
ఎదిరించి నిల్వాలె ఉయ్యాలో... ఎరుపెక్కి గెల్వాలె ఉయ్యాలో
మోరులో మెరుపుంది ఉయ్యాలో.. ఊరిలో జత కట్టాలె ఉయ్యాలో ||పోరుపోరమ్మ||
చరణం: చదువుల సరస్వతి ఉయ్యాలో... సిరుల మాలచ్చి ఉయ్యాలో...
తోబుట్టువుకు రక్లైంది ఉయ్యాలో... పెనిమిటికి వంశం ఇచ్చింది ఉయ్యాలో...
సంపదల శ్రీవల్లి ఉయ్యాలో.. సిరులెన్నో పెంచింది ఉయ్యాలో...
సమ్మక్క సారక్క తొవ్వలో ఉయ్యాలో... పోరు జెండెత్తు ఉయ్యాలో ||పోరుపోరమ్మ||
- తంగిరాల చక్రవర్తి, 9393804472