Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు వస్తూ ఉంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. కొన్ని పద్దతులతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు. చక్కెర అధికంగా తీసుకోవడం వలన కూడా ముఖంపై ముడతలు వస్తాయి.
పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన కూడా అధిక వేడి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. చర్మంపై తేమ అనేది చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. కాబట్టి సహజసిద్ధమైన తేమ కోసం నీటిని తగిన మోతాదులో తాగాలి. మంచి ఆహారం తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే పొడిగా నైపిస్తే ముఖానికి మాయిశ్చరైజర్ ను వినియోగించడం మంచిదే అంటున్నారు. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన ముఖంపై ముడతలు త్వరగా రాకుండా అరికట్టవచ్చంట.