Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటి పనీ, ఆఫీసు బాధ్యతలు నిర్వర్తించే మహిళలు కాస్త ఎక్కువే ఒత్తిడికి గురవుతారు. ఇది అలసట, నిస్సత్తువకు కారణం అవుతుంది. అలాకాకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే...
చాలామందికి వ్యాయామం అలవాటు ఉంటుంది కానీ ఆఫీస్ నుంచి వచ్చాక ఇందుకు సమయం కేటాయిస్తారు. అలాకాకుండా ఉదయం వేళల్లోనే ఆ పని చేయండి. ఎందుకంటే శారీరక శ్రమ తర్వాత మన శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మనల్ని నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా కాపాడతాయి. ఆలోచనల్లో ఓ స్పష్టతనిస్తాయి. ఆ ఉత్సాహం మీకు రోజంతా ఉంటుంది.
తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా ఎన్నో పనులను మల్టీటాస్కింగ్ చేస్తూ ఉండి ఉండొచ్చు. మరెన్నో చేయాలనే ఆలోచనలూ మెదడులో తిరగొచ్చు. అయితే వాటన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయండి.
పని మొదలయ్యే తొలి నాలుగు గంటల్లో మన సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. కాబట్టి కీలకమైన పనులన్నీ అప్పుడే పూర్తిచేసేలా మీ ప్రణాళిక ఉండాలి. సరైన పోషకాలు తీసుకోవడం ఎంత అవసరమో! శరీరానికి కదలిక అంతే ముఖ్యం. గంటకోసారైనా నీళ్లు తాగండి.