Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మ సంరక్షణ చాలా కీలకమవుతుంటుంది. ఈకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ఈకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా పొడి బారి.. దురద రావడం. అందుకే చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ఉంచుకుంటే మంచిది. టమాటాలతోనూ ముఖాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
మెరిసే చర్మం కోసం టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని బాగా మెరుగుపరుస్తుంది. టమోటా రసాన్ని తీసుకొని చర్మంలోని టాన్ ఉన్న ప్రదేశాలకు అప్లై చేసి బాగా మసాజ్ చెయ్యండి. 15 నిమిషాలు బాగా ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారానికి మూడుసార్లు చేయాలి.
కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి ఇంకా తేలికపాటి ఆమ్లాలు మంచి డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలను తీసుకొని అందులో కాటన్ బాల్‌ను ముంచి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చెయ్యండి. ఆరిన తర్వాత కడగండి.