Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలపై రోజురోజుకు హింస పెరిగిపోతూనే ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినా రక్షణ కరువైంది. నిర్భయ ఘటనతో చలించిపోయిన ఓ యువకుడు మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడు, నివసించే చోటే ఉపాధి చూపగలిగినపుడు మాత్రమే రక్షణ కల్పించగలమని గుర్తించాడు. అదే లక్ష్యంతో కార్గో సంస్థను స్థాపించాడు. మహిళలను డెలివరీ ఏజెంట్లుగా మార్చేందుకు శక్తివంతంగా కృషి చేస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఆ సంస్థ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
ఇరవై ఒక్క ఏండ్ల అఫ్రీన్ నాగపూర్‌లో నివసిస్తోంది. ఆమె ఉదయం 5 గంటలకు నమాజ్ చేసుకొని ఇతర ఇంటి పనులను పూర్తి చేసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఉదయం 7 లోపు డెలివరీ కోసం ప్యాకేజీలను సేకరిస్తుంది. సుమారు 50 ప్యాకేజీలను (బిజీగా ఉన్న రోజుల్లో అయితే 100) డెలివరీ చేసి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటుంది. అఫ్రీన్ తన ఉద్యోగంతో పట్ల సంతోషంగా లేదు. ఆమె ఏమంటుందటే ''బడి ముష్కిల్ సే యే జాబ్ కర్నే కే లియే బహార్ భేజా గయా హై (ఇంట్లో వారిని ఎంతో బతిమలాడి ఒప్పించి అతి కష్టంమీద ఈ ఉద్యోగంలో చేరగలిగాను).''
బయటకు రావడం కష్టం
సాధారణంగా ముస్లిం మహిళలు బురఖాలలో ఉండాలనీ, బయట పని చేయకూడదని భావిస్తున్నారు. ఆమె తల్లి ఆమెను ''ఇలా బయటకు వెళ్ళి చేసే పని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బయకు వెళ్ళ కూడదని కోరింది. అందువల్ల ఆఫ్రీన్ పని నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అస్సలు బయటకు వెళ్ళదు.
మహిళలకు శిక్షణ
ఢిల్లీకి చెందిన ఈకామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ-డెలివరీ ఏజెంట్లుగా ఈవెన్ కార్గోతో పనిచేసే 200 మంది మహిళలలో ఆఫ్రీన్ ఒకరు. సోషల్ కామర్స్ స్టార్టప్ అయిన యోగేశ్ కుమార్ స్థాపించిన ఈ సంస్థ మహిళలకు మరింత ఉపాధి కల్పించడం కోసం ప్రారంభించబడింది. ప్రస్తుతం 300 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇస్తోంది. కార్గో డెలివరీ ఏజెంట్లు వారు అందించే ప్యాకేజీలను బట్టి ప్రతి నెలా సగటున రూ.20,000 సంపాదిస్తారు. 5 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించబడిన కార్గో టీఐఎస్ఎస్లో రెండు సంవత్సరాలు కొనసాగింది. ఇప్పుడు బి2బి లాజిస్టిక్స్ స్టార్టప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇకామర్స్ కంపెనీలను అందిస్తుంది. ప్రస్తుతం ఏడు ప్రాంతాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
నిర్భయ స్ఫూర్తితో
2012లో నిర్భయ ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఆసమయంలో యోగేష్ కుమార్ అనే ఇంజనీర్ కూడా మహిళలకు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలను సృష్టించాలని భావించాడు. అతను విద్యార్ధులు, సామాజిక కార్యకర్తలతో కలిసి లింగ సమానత్వంపై అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా తన పనిని ప్రారంభించాడు. అతను అప్పటి ఢిల్లీకి చెందిన ఓపెన్ యువర్ ఐస్ సంస్థ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు.
ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడే
వాస్తవానికి అతను ఢిల్లీ నగర మ్యాప్‌ని, దాని భద్రత ఆధారంగా కలర్ కోడెడ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక పోలీసులకు సహాయం చేసాడు. ఇది అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులను సంబంధిత పోలీసులకు నివేదిస్తుంది. ఇది అంత సమర్థవంతంగా పని చేయలేదు. ఈ సేవలు కేవలం మధ్యతరగతి, సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యాయని గ్రహించాడు. సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలకు రక్షణ కల్పించే విషయంపై దృష్టిపెట్టాడు. లింగ అసమానతను తగ్గించడానికి ఆర్థిక స్వాతంత్య్రం మొదటి అడుగుగా భావించిన యోగేష్ మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు.
లింగ వివక్షకు వ్యతిరేకంగా
2016లో అతను 'బై ఉమెన్, ఫర్ ఉమెన్' (మహిళల ద్వారా, మహిళల కోసం) అనే క్యాబ్ సేవను అమలు చేయడానికి ఈవెన్ కార్గోను స్థాపించాడు. ప్రారంభించిన ఆరు నెలల తర్వాత స్టార్టప్ వ్యవస్థాపక సభ్యురాలు కరీనా భాసిన్ యోగేశ్‌తో చేరారు. 2018 జనవరిలో కథువాలో జరిగిన లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినప్పుడు ఆమె ఎంబిఏ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సంఘటన తర్వాత ఆమె మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకుంది.''కథువా వార్తలు నిజంగా బాధాకరమైన అనుభవం. నిర్భయ వార్తలు వెలువడినప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పట్లో నేను చేయగలిగింది ఎక్కువగా కవితలు రాయడం మాత్రమే. దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదు'' అని ఆమె అన్నది.
సవాళ్ళ ఆధారంగా
2016లో కార్గో... పురుషుల ఆధిపత్య రంగంలో మహిళల భాగస్వాములను చేయడానికి చూస్తోంది. దీని కోసం కరీనా పట్టణ మురికివాడల్లో వాలంటీర్ల బృందంతో గడిపారు. వారి అవసరాలు, సవాళ్ల ఆధారంగా కమ్యూనిటీ ఆధారిత శిక్షణ మాడ్యూల్లను రూపొందించారు.''ఉదాహరణకు గతంలో ద్విచక్ర వాహన శిక్షణ కార్యక్రమం ఢిల్లీలోని రెండు శిక్షణ కేంద్రాలలో మాత్రమే జరిగేది. కానీ కొంతమంది మహిళలు మెట్రో, ప్రజా రవాణా ద్వారా ప్రయాణించలేకపోతున్నారని మేము గ్రహించాము. కాబట్టి మేము శిక్షణా కేంద్రాల కోసం కమ్యూనిటీ పార్క్‌లను ఆశ్రయించాము. వారి ఇంటి మగవారి నుండి వాహనాలను అద్దెకు తీసుకోవాలని అడిగాము. అప్పుడు వారు శిక్షకులుగా కార్యక్రమంలో భాగం కావచ్చు'' అని చెప్పారు కరీనా.
ఉపాధి కల్పించడమే లక్ష్యంగా
రెండు సంవత్సరాల తర్వాత కార్గో నాగపూర్, జైపూర్, ఇండోర్ వంటి టైర్ - 2 నగరాల్లోకి ప్రవేశించింది. పట్టణ, గ్రామ మురికివాడలలో గడిపిన తర్వాత స్టార్టప్ ప్రతి భౌగోళిక సామాజిక సంస్కృతికి శిక్షణ మాడ్యూల్లను స్వీకరించింది. ఇది వారి స్థానిక పట్టణాలు, నగరాలలో మహిళలను నియమించి మెట్రోలపై ఆధారపడే పరిస్థితి నుండి బయటపడేసింది. ''నాగ్‌పూర్‌లో ఒక మాల్ మాత్రమే ఉంది. ఇక్కడ మహిళలు సేల్స్ ఉమెన్స్‌గా ఉద్యోగం పొందవచ్చు. కానీ వారు ఉద్యోగం కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. బస్ ఛార్జీలతో సహా కనీసం రూ.10,000 వరకు సంపాదించాలి. ఆర్థికంగా లేనందున మహిళలు నిరుద్యోగులుగా మారతారు'' అని ఆమె వివరిస్తున్నారు.
మహిళలు పోటీదారులుకారు
స్టార్టప్ స్థానిక సంస్థలతో మాట్లాడే ముందు లైంగికంగా వారు ఎదుర్కొన హింస, మహిళల జనాభా, వారి ఉపాధి స్థితి, గ్యాస్ స్టేషన్ల యాక్సెస్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని మహిళలకు ప్రయాణ సౌలభ్యాన్ని క్రమం తప్పకుండా విశ్లేషిస్తుంది. మహిళా డెలివరీ ఏజెంట్లు తమ ఉద్యోగులను చేస్తున్నప్పుడు గిడ్డంగులలో పనిచేసే పురుషులు తమ ఉద్యోగాలు పోతున్నట్టుగా, వారిని తమ పోటీదారులుగా భావించకూడదు. వారితో సమాన ఉద్యోగులుగా చూడాలని'' కరీనా అంటున్నారు.
- సలీమ