Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మ సౌందర్యాన్ని రక్షించు కోవాలంటే పైపై పూతలు రాస్తూ, ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొన్ని అలవాట్లను మానుకోవాలంటున్నారు.
కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. పాల ఉత్పత్తులను అతిగా తినకూడదు. ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చక్కెర, జంక్ ఫుడ్స్, చిప్స్, ఐస్క్రీం వంటి వాటికి దూరంగా ఉండాలి.
మొటిమలను గిల్లకూడదు. అలాగే వర్కవుట్లు చేసిన తర్వాత స్నానం చేయడానికి బద్ధకించకూడదు. చెమటపట్టిన చర్మాన్ని శుభ్రం చేయకపోతే రకరకాల బ్యాక్టీరియాలు చర్మ రంధ్రాల్లో చేరి ముఖంపై మొటిమలు రావడానికి కారణమవుతాయి.
కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజుకి కనీసం ఆరేడు గంటల నిద్ర ఉండాలి. అలాగే ఆరు లేదా ఏడు గ్లాసుల నీటిని తాగాలి.