Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు. అందుకే మనం వాటికి కాస్త దూరంగా ఉండాటానికి ప్రయత్నిస్తాం. జిమ్ లేదా యోగా ఆసనాలతో బరువుకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తాం. అయితే కచ్ఛిత్తంగా కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌కు మనం దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. అందులో కొన్ని రకాల పిండితో తయారు చేసుకునే చపాతీలను కూడా బ్రేక్ చేయమంటారు. అయితే, కొన్ని రకాల పిండితో తయారు చేసే రోటీలు బరువు తగ్గడానికి ఉపకరిస్తాయట. ఈ పిండి పదార్థాల్లో ఆరోగ్యకరమైన న్యూట్రియేంట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
జొన్నపిండి: జొన్నలతో తయారు చేసిన పిండిని మన పూర్వీకుల కాలం నుంచి తీసుకుంటారు. ఇది చాలా ఆరోగ్యకరంతోపాటు గ్లూటెన్ ఫ్రీ పిండి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది డైజెషన్ సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి మంచిది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీకు జొన్నరొట్టెలు తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే.. కాస్త గోధుమ పిండి కలిపి తయారు చేసుకోవచ్చు.
రాగిపిండి: రాగి కూడా గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్. ఇందులో ఫైబర్‌తోపాటు అమైనో యాసిడ్స్ ఉంటాయి. త్వరగా మీ ఆకలిని తీర్చడంతోపాటు బరువు తగ్గడానికి సహకరించే మంచి పిండి. ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం లేదు. సులభంగా కూడా అరుగుతుంది.
సజ్జలు: మరో అద్భుతమైన గ్లూటెన్ ఫ్రీ పిండి సజ్జపిండి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, న్యూట్రియేంట్స్ ఉంటాయి. మీ ఒంట్లో వేడిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. త్వరగా మన ఆకలిని తీర్చేస్తుంది.
ఓట్స్ ఫ్లోర్: ఓట్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆహారం. ఇది తీసుకోవడం వల్ల మనకు త్వరగా ఆకలి వేయదు. ఇందులో సాల్యూబుల్ ఇన్‌సాల్యూబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇది కార్డియో వాస్క్యూలర్ వ్యాధుల నివారణకు కూడా అద్భుతంగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఈ కాలంలో ఓట్స్ వాడే వారు ఎక్కువనే ఉన్నారు. వీటితో టిఫిన్స్, స్వీట్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు.