Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఈ రెండూ మన కేశాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. వేలకు వేలు ఖర్చుపెట్టి ఏవేవో వాడుతుంటారు. అయితే జుట్టు రాలిపోవడాన్ని జామకాయ, ఆకులు తగ్గిస్తాయి.. ఆ చిట్కాల గురించి మనమూ తెలుసుకుందాం...
జామలో చాలా అధికస్థాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక జామను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే జామ ఆకులను తీసుకొని పేస్ట్ లాగా చేసి హెయిర్ మాస్క్‌గా అప్లై చేస్తే జుట్టుకు చాలా మంచిది. చాలా ఆరోగ్యంగా ఇంకా దృఢంగా జుట్టు తయారవుతుంది.
పాలకూరలో అనేక విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక రెగ్యులర్ డైట్లో పాలకూరని కనుక తింటే అది జుట్టుకు చాలా ఉపయోగకరంగా, ఆరోగ్యకరంగాను ఉంటుంది. పాలకూరలో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, బీటా కెరోటిన్ అనేవి ఎంతో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా, అందంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
ఇక సాల్మన్ చేపలో ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఎదుగుదలకు ఎంతో మంచివి.
గ్రీక్ పెరుగు కూడా జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పెరుగులో విటమిన్ బి 5 ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని వెంటనే తగ్గిస్తుంది.