Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు ఉన్న వారిలో చాలా మందికి పొట్ట ఉంటుంది. ఎవరైనా సరే బరువు తగ్గాలంటే ముందు పొట్ట తగ్గాలి. ఇది తగ్గకుండా బరువు తగ్గడం కష్టం అంటున్నారు నిపుణులు. పొట్ట ఉంటే టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనంతటికీ కారణం ఆ కొవ్వే. అనవసరంగా ఉన్న అధిక కొవ్వును కరిగించేసుకోవాలి. పొట్టను టేపుతో కొలుచుకోండి. మగవాళ్లకు 102 సెంటీమీటర్లు దాటకూడదు. మహిళలకు 88 సెంటీమీటర్లు దాటకూడదు దాటితే పొట్ట ఒబెసిటీ ఉన్నట్టే. దాన్ని తగ్గించుకునే ఆరు మార్గాలు తెలుసుకుందాం.
షుగర్ ఉన్న ఆహారాలు తింటే బరువు పెరుగుతారు. అందులోని ఫ్రక్టోజ్ పొట్టలో కొవ్వు తయారయ్యేలా చేస్తుంది. లివర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంతవరకూ పంచదారను తగ్గించేయండి. పంచదార ఉండే డ్రింగ్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, జ్యూసులు, బిస్కెట్లు, కేకులు వంటివి తినకండి.
ప్రోటీన్ వేడిగా ఉంటుంది. ప్రోటీన్ ఉండే ఏ పదార్థం తిన్నా బాడీలో వేడి పెరుగుతుంది. దాంతో కొవ్వు ఐస్‌క్రీమ్‌లా కరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉండే పప్పులు, బద్దలు, బాదం వంటివి తీసుకోండి. ఐతే ప్రోటీన్‌తో జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువైతే గొంతులో గరగర వచ్చి ఆ తర్వాత జలుబు, దగ్గు వంటివి మొదలవుతాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకోవాలి.
జామకాయలు, ఆకు కూరలు, కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. ఇది బాగా తింటే కొవ్వు కరిగేలా చేస్తుంది. పొట్టలో అంతా క్లీన్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఫైబర్ బాగా లభించే ఆహారం ఎక్కువ తినాలి.
నడవడం, స్వమ్మింగ్ చెయ్యడం, వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) వంటివి కూడా పొట్టను తగ్గిస్తాయి. వీలు చూసుకొని రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళ ఓ గంట నడిచేలా ప్లాన్ వేసుకోండి. వీలైతే రన్నింగ్ కూడా చెయ్యండి. ఒకేసారి కొవ్వు కరిగిపోవాలని అనుకోవద్దు. అలా ఎప్పుడూ జరగదు. నెమ్మదిగానే కరుగుతుంది. అలాగే కరగనివ్వాలి. అదే ఆరోగ్యానికి మంచిది.
నీరు తాగాలి అనే విషయం మనకు గుర్తుండదు. పనుల్లో పడి మర్చిపోతాం. డాక్టర్లేమో అదే విషయాన్ని పదే పదే చెబుతారు. పని చేసే చోట ఓ బాటిల్లో నీరు ఉంచుకొని కనీసం 2 గంటలకు ఓసారైనా తాగుతూ ఉండాలి. అలా ప్రతి 25 కేజీల బరువుకూ లీటర్ నీరు తాగాలి. మీరు 50 కేజీల బరువు ఉంటే మీరు రోజూ 2 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. 75 కేజీల బరువు ఉంటే కనీసం 3 లీటర్ల నీరు రోజుకు అవసరం. ఇవన్నీ చిన్నచిన్న చిట్కాలే. జాగ్రత్తగా ఫాలో అయితే కచ్చితంగా కొవ్వు కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.