Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లడఖ్‌లోని ఓ గ్రామానికి చెందిన 48 ఏండ్ల మహిళా రైతు... అప్పటి వరకు వ్యవసాయం తప్ప మరో ప్రపంచం తెలియదు. కానీ ఇప్పుడు ఎయిర్బిన్బి, ఎస్ఇడబ్ల్యూఏ హౌస్ట్‌గా ఎలా మారింది... ఒకప్పుడు అడుగుబయట పెట్టేందుకు బిడియపడే ఆమె ఇప్పుడు తనలాంటి గ్రామీణ మహిళలు ఎందరికో శిక్షణ ఇస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. ''హమ్ సబ్ ఎక్' సహాయంతో తనని తాను నిలబెట్టుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆమె స్ఫూర్తిదాయక జీవితం గురించి నేటి మానవిలో...
యాంగ్జాస్ తన భర్త, ముగ్గురు కొడుకులతో కలిసి లడఖ్‌లోని లేV్‌ాలోని ఫ్యాంగ్ గ్రామంలో నివసిస్తోంది. లేV్‌ా విమానాశ్రయం నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఫ్యాన్ గ్రామం ఉంటుంది. దాంతో ఇది ఓ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ చెప్పుకోదగిన వాటిలో ముఖ్యమైనవి 900 సంవత్సరాల కిందటి పురాతనమైన మఠం, అందులో ఉండే ప్రాచీన వాల్ పెయింటింగ్స్, పాత కాలం నాటి కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు దీని అందమైన నిర్మాణం, అరుదైన కళాఖండాలపై ఆసక్తి చూపుతున్నారు.
వ్యవసాయమే ఆధారం
యాంగ్జాస్ ఓ రైతు. అయితే ఈ ప్రాథమిక ఆదాయ వనరు కుటుంబాలను నిలబెట్టుకోవడానికి సరిపోదు. గ్రామంలో చాలా మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. ఏడాదిలో ఆరు నెలల పాటు ఆమె బ్రోకలీ, టమోటాలు, వంకాయలు, క్యాప్సికమ్ పండిస్తుంది. లడఖ్‌లోని ప్రతి ఇంట్లో దాదాపుగా కూరగాయలు, పండ్లు పండిస్తుంటారు. కొందరు తమ జీవనోపాధి కోసం పశువులను కూడా పెంచుతారు. ''2010లో భారీ వరదలు మా పొలాలు, పంటలను నాశనం చేశాయి. వ్యవసాయం ఇకపై సొంతంగా నిలదొక్కుకోదని మేము భావించాము'' అని ఆమె గుర్తుచేసుకుంది.
అదనపు ఆదాయం కోసం
యాంగ్జాస్కు 48 ఏండ్లు ఉన్నప్పుడు ఎస్ఇడబ్ల్యూఏ బృందం ఆమె గ్రామాన్ని సందర్శించింది. అప్పుడే ఆమె హోంస్టేను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇది తన కుటుంబానికి అదనపు ఆదాయ వనరుగా మారుతుందని ఆశించింది. ''నేను వస్త్రాల తయారీలో శిక్షణ పొందాను. మగ్గంపై నేయడం, ఎస్ఇడబ్ల్యూఏ బృందాల సహకారంతో ఆహార ప్రాసెసింగ్‌తో సహా నేర్చుకున్నాను. 'లడక్ లూమ్స్' అనే వారి సమూహంలో భాగం అయ్యాను. గతంలో కాస్త బెరుకుగా ఉండేది. శిక్షణ నాపై నాకు నమ్మకం కలగడానికి సహాయపడింది. ఇప్పుడు మా చుట్టుపక్కల ఉండే ఇతర మహిళలకు శిక్షణనివ్వడానికి నన్ను సమన్వయకర్తగా ఎంపిక చేశారు'' అంటూ గర్వంగా చెబుతున్నారు.
స్ఫూర్తినిచ్చిన టూర్
ఎస్ఇడబ్ల్యూఏతో అనుబంధంలో భాగంగా యాంగ్జాస్ ఎక్స్పోజర్ టూర్ కోసం గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్ మహిళలు ఎలా పని చేస్తున్నారో, వారు తమ జీవనోపాధిని ఎలా నిర్వహిస్తున్నారో చూశారు. ''ఈ టూర్ హోమ్‌స్టే ప్రారంభించడానికి నాకు స్ఫూర్తినిచ్చింది. కుటుంబాన్ని, ఇంటిని చూసుకోవడానికి నాకు మరింత బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే ఇతరులను కూడా అలా తయారు చేయడానికి ప్రేరేపిస్తుంది'' అని ఆమె చెప్పారు.
పర్యాటకులకు అనుకూలంగా
యాంగ్జాస్ ఎస్ఇడబ్ల్యూఏ వారి 'హమ్ సబ్ ఎక్' చొరవ సహాయంతో హోమ్‌స్టేను ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఇద్దరు అంతర్జాతీయ అతిథులకు ఆమె ఆతిథ్యం ఇచ్చారు. ''వారు నా కుటుంబంతో ఒక నెల పాటు ఉన్నారు. ఇది మా అందరికీ అద్భుతమైన అనుభవం. నేను మరింత హోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎస్ఇడబ్ల్యూఏలో హోస్టింగ్ చేయడం పట్ల చాలా సంతోషిస్తున్నాను. మేము వారి కోసం భోజనాన్ని వండడం, వంటకాలను పంచుకోవడం, కలిసి తినడం వంటివి కూడా అందిస్తాము. పర్యటన కోసం వచ్చిన వారు తమ ఇంట్లోనే ఉంటున్న అనుభూతి చెందడానికి ఇష్టపడతారు. వారు మా కిచెన్ గార్డెన్‌ను సందర్శించవచ్చు. సాంస్కృతిక కథనాలను పంచుకోవచ్చు. మాకు తెలిసినంత మేరకు వారు సందర్శించగలిగే ప్రదేశాలకు మేము వారికి మార్గనిర్దేశం చేస్తాము'' అని యాంగ్జాస్ చెప్పారు.
పర్వతాలను ఇష్టపడతారు
కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. వ్యాక్సిన్లు వేసుకున్న వారికి మాత్రమే అక్కడ పర్యటించే అనుమతి ఉంది. ''సుమారు రెండేండ్ల విరామం తర్వాత ప్రజలు ఇప్పుడు పర్వతాలలో, ప్రకృతి చుట్టూ ఉన్న మారుమూల నిశ్శబ్ద ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతున్నారు'' అంటూ ఆమె జతచేస్తుంది.
పర్యాటకాన్ని పునర్నిర్మించడానికి
ఇటీవల లడఖ్ నుండి 10 మంది ఎస్ఇడబ్ల్యూఏ సభ్యులకు ఎయిర్బిన్బి ప్లాట్‌ఫారమ్‌లో హోస్ట్‌లుగా వారి భాగస్వామ్యాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. యాంగ్జాస్ వారిలో ఒకరు. ఈ భాగస్వామ్యం యాంగ్జాస్ వంటి గ్రామీణ లడఖ్‌లో మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరింపజేస్తుంది. కమ్యూనిటీలకు సానుకూల ఫలితాలను అందించే విధంగా పర్యాటకాన్ని పునర్నిర్మించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్త పర్యాటకులతో...
ఎయిర్బిన్బిలో శిక్షణ పొందిన ఎస్ఇడబ్ల్యూఏ సభ్యులకు ఇంటి భాగస్వామ్యం, ఆతిథ్యం, నాణ్యతా ప్రమాణాలు, బాధ్యతాయుతమైన హోస్టింగ్ పద్ధతులపై శిక్షణ ఇస్తుంది. అదే సమయంలో డిజిటల్ చేరికను ప్రోత్సహిస్తుంది. ఈ మహిళా హోస్ట్‌లు ప్రపంచవ్యాప్త ప్రయాణికుల సంఘంతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అమన్‌ప్రీత్ బజాజ్, జనరల్ మేనేజర్-ఎయిర్బిఎన్బి ఇండియా, ఆగేయాసియా, హాంకాంగ్, తైవాన్, భారతదేశంలోని కమ్యూనిటీలలోని మహిళలకు సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన సాధనాలు, పరిజ్ఞానంతో వారు తమ సహాయాన్ని కొనసాగిస్తారని చెప్పారు.
మహిళలకు శిక్షణ
హోంస్టేలను హోస్ట్ చేయడంలో శిక్షణ పొందడమే కాకుండా నేరేడు పండు రసం, నేరేడు పండు జామ్, స్వదేశీ ఉత్పత్తుల పెంపకం, తయారీ గురించి కూడా ఆమె నేర్చుకుంటుంది. ''ఓ గొప్ప విషయం ఏమిటంటే నేను ఇప్పుడు 100 కి.మీ.ల దూరంలో ఉండే మహిళలకు కూడా శిక్షణను అందించగలుగుతున్నాను. ఎస్ఇడబ్ల్యూఏలో శిక్షణ తీసుకున్న తర్వాత నేను హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టాను. ఈ బృందం మాకు విశ్వాసాన్ని అందించింది. ఇక్కడ నేను సమావేశాలకు నాయకత్వం వహించగలను. నా సమాజంలో సాధారణంగా బయటకు రావడానికి సిగ్గుపడే మహిళలను, భర్తలపై ఆధారపడిన మహిళలను ప్రోత్సహిస్తాను'' అని యాంగ్జాస్ చెప్పారు.
- సలీమ