Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది నాలుగు పదుల వయసులో కూడా అందంగా.. యంగ్‌గా కనిపిస్తారు. మరికొంత మంది అయితే మూడు పదుల వయసులోనే ముసలివాళ్లలా కనిపిస్తారు. యవ్వనంగా కనిపించడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తారు. అయితే భవిష్యత్తులోనూ యంగ్‌గా కనిపించాలంటే ఒక్కరోజులో అయ్యే పనికాదు. రోజు వారి అలవాట్లే వారిని అలా తీర్చిదిద్దుతాయి. మన వయసు పెరుగుతోంది అనడానికి.. మన శరీరంలో ముఖం ఒక్కటి చూస్తే చాలు. ముఖంలో వచ్చే మార్పులతో మనం వృద్ధాప్యంలోకి చేరు కుంటున్నామని గుర్తించవచ్చు. కానీ ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా మాత్రం కొన్ని పద్దతుల ద్వారా సాధ్యమే. కొన్ని రకాల చిట్కాలతో ముఖం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.
మంచినీరు ఎక్కువగా తాగేవారి ముఖం నిత్య యవ్వనంగా కనపడుతుందట. కాబట్టి ప్రతిరోజూ 8 గ్లాసుల మంచినీరు తాగాలి. దాని వల్ల ఆరోగ్యంతోపాటు.. అందం కూడా మీ సొంతమౌతుందని చెబుతున్నారు. వాడకాన్ని తగ్గించాలి. అంతేకాకుండా షుగర్ వాడకాన్ని కూడా తగ్గిస్తే.. చర్మానికి మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు కూడా తగ్గుతాయి.
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా నారింజ, క్యారెట్, అవకాడోలకు ఎక్కువ చోటు ఇవ్వాలి. ఇవి చర్మంపై ముడతలు తగ్గించి.. చర్మం నిగారించడానికి సహాయం చేస్తుంది.
చర్మ ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా కీలకం. కాబట్టి సరిపడా నిద్ర పోవాలి. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం .
చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ వాడటం ఆపకూడదు. ఇది చర్మాన్ని ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడకపోవడం మంచిది.