Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ వచ్చిందంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం సహజం. దాంతో అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఈ కాలంలో మనం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. రోగనిరోధక శక్తి కాస్తంత సన్నగిల్లినా ఫ్లూ, వైరల్ ఫీవర్స్, ఇతర వ్యాధులు వేధిస్తాయి. వీటిని ఎదుర్కొనే కొన్ని చిట్కాలు...
అల్లం, తేనె, నిమ్మరసంతో తయారు చేసిన పానీయం. తేనేలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియాల్ గుణాలు ఉన్నాయి. ఆగకుండా వచ్చే దగ్గును ఆపే శక్తి తేనెలో ఉంది.
పసుపు వాడకంతో వ్యాధులను దూరం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన చిట్కానే. రోజుకు రెండుసార్లు పాలల్లో పసుపు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పసుపు, తులసితో తయారు చేసిన కషాయాన్ని చాలా మంది తాగుతారు. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. కాస్త నలతగా అనిపించినప్పుడు తులసి కషాయం తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.