Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రెండేండ్లలో గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. దీని ధర పెరుగుతున్నా కొద్ది మనపై కూడా దాని ప్రభావం కచ్చితంగా పడుతుంది. వంటగ్యాస్ లేకుండా గంట కూడా గడవదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఖరీదైన గ్యాస్‌ను చాలా తెలివిగా ఉపయోగించడం అవసరం. మనం గ్యాస్‌ను ఎంత ఎక్కువ ఆదా చేస్తామో అంత ఎక్కువ ప్రయోజనం. గ్యాస్‌ను ఆదా చేయడానికి కొన్ని ఈజీ చిట్కాలు ఉన్నాయి. దీంతో మీకు గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం...
- వంట చేసే ముందు అన్ని పదార్థాలను సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది మీకు సమయం, గ్యాస్ రెండింటినీ ఆదా చేస్తుంది. వంట చేసేటపుడు ఎల్లప్పుడూ సరైన సైజ్ కడాయి లేదా ప్యాన్ ఉపయోగించాలి.
- పెద్ద ప్యాన్ ఉపయోగించినట్టయితే.. దాన్ని వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్ అవసరమవుతుంది. అదే సమయంలో చిన్న సైజ్ ప్యాన్‌లో ఆహారాన్ని వండినప్పుడు కూడా గ్యాస్ మంట బయటకు వస్తుంది. వినియోగం ఎక్కువ అవుతుంది.
- ముఖ్యంగా ఏ పదార్థాలను వండినా మూత పెట్టడం మరచిపోకూడదు. లేకుంటే గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. అటువంటి సమయంలో వంటగ్యాస్ మామూలు కంటే మూడు రెట్లు ఎక్కువగా వృథా అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వండేటప్పుడు మూత కచ్చితంగా పెట్టాలి.
- పాలు, కూరగాయలు వండటానికి 2 గంటల ముందే ఫ్రిజ్‌లోనుంచి బయటకు తీయాలి. ఆ తర్వాత మాత్రమే ఉడికించాలి. అది గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మాంసం, పప్పులు, చికెన్ ఉడకబెట్టడం వల్ల ఎక్కువగా గ్యాస్ అయిపోతుంది. అందువల్ల వీటిని వండటానికి ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్ వినియోగించండి.
- ఒకవేళ మైక్రోవేవ్ ఉంటే దాని ముందుగా సెమీకూక్ చేయడం తర్వాత అది మరింత త్వరగా ఉడికిపోతుంది.
- గ్యాస్ మీద వంట చేసేటప్పుడు గ్యాస్‌ను మీడియం మంటపై ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆహారం అధికమంట మీద, చాలా తక్కువ మంట మీద చేస్తే.. గ్యాస్ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
- ఇక చలికాలంలో గ్యాస్ బండ త్వరగా అయిపోతుంది. ఏవైనా పదార్థాలను వేడి చేయడానికి ఇదొక్కటే ఆధారం. కాబట్టి గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ లేదా సోలార్ పవర్‌తో వేడి చేసే పరికరాలను ఉపయోగించాలి.